రక్షా బంధన్ లేదా రాఖీ పండుగ అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక. ఈ ఏడాది ఆగస్టు 19న రాఖీ పండుగ జరుపుకుంటాం. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాఖీ ఎప్పుడు కట్టాలి. ఏ సమయం శుభమే తెలుసుకుందాం.
unplash
By Bandaru Satyaprasad Aug 17, 2024
Hindustan Times Telugu
కష్టసుఖాల్లో తమకు అండగా ఉండాలని అన్నదమ్ముళ్లలు అక్కచెల్లెళ్లు రాఖీ కడతారు. ప్రతీ ఏడాది శ్రావణ మాసం పూర్ణిమ నాడు రాఖీ పండుగ జరుపుకుంటాం.
unsplash
ఈ ఏడాది రాఖీ పండుగ ఆగస్టు 19న వచ్చింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆగస్టు 19వ తేదీ ఉదయం గం.5.52 ల నుంచి మధ్యాహ్నం గం.1.32 ల వరకు భద్రకాలం ఉంది. భద్ర కాలంలో రాఖీ కట్టడం శుభం కాదని జ్యోతిష శాస్త్రం చెబుతోంది.
pexels
భద్రకాలంలో రాఖీ కడితే దోషమని పండితులు అంటున్నారు. ఈ సమయంలో రాఖీ కడితే సోదరులపై దుష్ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. భద్రకాలంలో రాఖీ కడితే ఆ ఏడాదంతా సోదరులకు కష్టనష్టాలు, సమస్యలు వస్తాయని అంటున్నారు.
pexels
భద్ర కాలం అంటే అశుభ సమయం. ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు తలపెట్టరు పెద్దలు. రాఖీ కట్టడం కూడా ఒక శుభంగా భావిస్తాం కాబట్టి ఆ సమయంలో రాఖీ కట్టరు.
unsplash
పురాణాల ప్రకారం భద్ర దేవత కృష్ణుడి ఏడో భార్య. ఆమె విచిత్రమైన స్వభావం కలిగి ఉండేదని, శుభకార్యాలలో ఆటంకాలు కలిగిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. దీంతో భద్రకాలంలో సాధారణంగా శుభకార్యాలు మొదలుపెట్టరు.
pexels
రాఖీ కట్టడానికి మధ్యాహ్నం గం.1.32ల తర్వాత నుంచి సాయంత్రం గం.4.21ల వరకు మంచి సమయమని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే సాయంత్రం గం.6.56ల నుంచి రాత్రి గం.9.08ల వరకు ప్రదోష కాలం, ఈ సమయంలో కూడా రాఖీ కట్టవచ్చని చెబుతున్నారు.
twitter
ఆగస్టు 19న యజ్ఞోపవితం, ఉపాకర్మ వంటి శుభకార్యాలు చేయడానికి మంచి రోజు. వీటిపై భద్రకాలం ప్రభావితం పడదు. రాఖీ కట్టుకునేటప్పుడు మాత్రం మంచి సమయాన్ని పాటించాలని జ్యోతిష్యులు చెబుతున్నారు.
twitter
ఈ వెబ్ స్టోరీలోని సమాచారం మీ అవగాహనకు మాత్రమే. జ్యోతిష్యులు అందించిన సమాచారాన్నియథావిధిగా అందిస్తున్నాము.
twitter
గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి