ప్రొజెస్టెరాన్ రుతుచక్రాన్ని నియంత్రించడంలో, గర్భధారణలో కీలక పాత్ర పోషించే హార్మోన్. ప్రొజెస్టెరాన్ తక్కువ స్థాయిల్లో ఉంటే పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం, మూడ్ స్వింగ్స్, గర్భధారణ సమస్యలు వస్తాయి. ప్రొజెస్టెరాన్ స్థాయిలను సహజంగా పెంచే 9 చిట్కాలు తెలుసుకుందాం.
pexel
By Bandaru Satyaprasad Oct 07, 2024
Hindustan Times Telugu
జింక్ ఆహారాలు - జింక్ ప్రొజెస్టెరాన్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తుంది. గుమ్మడికాయ గింజలు, చిక్ పీస్, సీఫుడ్స్ లలో జింక్ పుష్కలంగా ఉంటుంది.
pexels
ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ - ప్రొజెస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తికి సహాయపడే హెల్తీ ఫ్యాట్స్ అవకాడో, నట్స్, సీడ్స్, కొకోనట్ ఆయిల్ ను మీ ఆహారంలో చేర్చుకోండి. ఇవి మీ శరీరానికి అవసరమయ్యే హార్మోన్ల ఉత్పత్తికి సహయపడతాయి.
pexels
విటమిన్ బి6 ఫుడ్స్ - విటమిన్ బి6 రుతు చక్రం లూటియల్ దశకు మద్దతు ఇస్తుంది. విటమిన్ బి6 పొందేందుకు అరటిపండ్లు, చిలగడదుంపలు, స్పినాచ్ వంటి ఆహారాలు తీసుకోండి.
pexels
విటమిన్ సి - విటమిన్ సి ఆహారాలు ప్రొజెస్టెరాన్ స్థాయిలను పెంచుతాయి. సిట్రస్ ఫ్రూట్స్ ఆరెంజ్, లెమన్స్ మీ ఆహారంలో చేర్చుకోండి.
pexels
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ - సాల్మన్ వంటి చేపలలో, అవిసె గింజల సప్లిమెంట్లలో లభించే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ప్రొజెస్టెరాన్ తో సహా హార్మోన్ల ఉత్పత్తికి, సమతుల్యతకు సహాపడతాయి.
pexels
ఆల్కహాల్ తగ్గించండి - ఆల్కహాల్ లివర్ పనితీరుపై ప్రభావం చూపుతుంది. లివర్.. హార్మోన్ల విచ్ఛిత్తికి ఉపయోగపడుతుంది. ఆల్కహాల్ తగ్గించడం హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరుస్తుంది.
pexels
ఒత్తిడిని నిర్వహించడం - ఒత్తిడి వల్ల విడుదలయ్యే కార్టిసాల్...ప్రొజెస్టెరాన్ లెవల్స్ ను తగ్గిస్తుంది. ఒత్తిడిని తగ్గించే ధ్యానం, లోతైన శ్వాస, యోగా పద్ధతులు పాటించడం వల్ల కార్టిసాల్ స్థాయిలను తగ్గించి, హార్మోన్ల బెలెన్స్ కు తోడ్పడుతుంది.
pexels
నిద్ర- ప్రశాంతమైన నిద్ర హార్మోన్ల ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. ప్రొజెస్టెరాన్ ఉత్పత్తికి రాత్రుళ్లు కనీసం 7-8 గంటల నిద్ర అవసరం.
pexels
వ్యాయామం - క్రమం తప్పకుండా మితంగా వ్యాయామం చేయడం ఒత్తిడి తగ్గుతుంది. బ్లడ్ సర్య్కూలేషన్ ను మెరుగుపరుస్తుంది. హార్మోన్ల సమతుల్యతకు సహాయపడుతుంది. అధిక వ్యాయామం ప్రొజెస్టెరాన్ స్థాయిలు తగ్గడానికి కారణం కావొచ్చు.
pexels
గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి