డెంగ్యూ అనేది డెంగ్యూ వైరస్ వల్ల కలిగే దోమల ద్వారా సంక్రమించే వైరల్ ఇన్ఫెక్షన్. ఇది ఈడిస్ ఈజిప్టి దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది. అధిక జ్వరం, తలనొప్పి, కళ్ల భాగంలో నొప్పి, కీళ్లు, కండరాల నొప్పి, దద్దుర్లు, తేలికపాటి రక్తస్రావం డెంగ్యూ లక్షణాలు.
pexels
By Bandaru Satyaprasad Jul 06, 2024
Hindustan Times Telugu
వర్షాకాలంలో డెంగ్యూ ఎక్కువగా వ్యాపిస్తుంది. వానాకాలంలో దోమల సంతానోత్పత్తి అనువైన పరిస్థితులు ఉంటాయి. డెంగ్యూ ప్రమాదాన్ని తగ్గించడానికి మీరు అనుసరించాల్సిన చిట్కాలు తెలుసుకుందాం.
pexels
నిల్వ నీటిని తొలగించండి - డెంగ్యూ వైరస్‌ను వ్యాప్తి చేసే దోమలు నిల్వ ఉన్న నీటిలో సంతానోత్పత్తి చేస్తాయి. మొక్కల సాసర్లు, బకెట్లు, పాత టైర్లు...ఇలా నీరు నిల్వ ఉండే వాటిని చెక్ చేసి వాటిని తొలగించండి. దోమలు గుడ్లు పెట్టకుండా నిరోధించడానికి కంటైనర్లను కవర్ చేయండి.
సరైన దుస్తులు ధరించండి - కాళ్లు, చేతులు కవర్ చేసేలా పొడవాటి దుస్తులు ధరించండి. ఆరుబయట ఉన్నప్పుడు దోమ కాటును నివారించేలా దుస్తులు ధరించండి. మీరు తగినంతగా కవర్ చేయబడి ఉండేలా చూసుకోండి.
pexels
దోమల తెరలను అమర్చండి-కిటికీలు, తలుపులపై దోమ తెరలను అమర్చితే మీ ఇళ్లలోకి దోమలు రాకుండా ఉంటాయి. విండో, డోర్ స్క్రీన్‌లతో పాటు బెడ్ నెట్‌లను ఉపయోగించండి.
pexels
పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి -పరిసరాలను క్లీన్ గా ఉంచుకోవడం వల్ల దోమల వృద్ధిని తగ్గించవచ్చు. చెత్త, నిల్వ నీరు లేకుండా ఎప్పటికప్పుడు కాలువలను శుభ్రం చేయండి. మీ ఇల్లు, పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే డెంగ్యూ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.
pexels
మస్కిటో ట్రాప్స్ ఉపయోగించండి- మస్కిటో ట్రాప్ లు మీ పరిసరాల్లో దోమల సంఖ్యను తగ్గించడంలో సహాయపడతాయి. దోమలు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో ఈ ట్రాప్ లను ఉంచండి.