IPL Auction 2024: ఈ వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న టాప్-10 ప్లేయర్స్

By Chatakonda Krishna Prakash
Dec 19, 2023

Hindustan Times
Telugu

ఐపీఎల్ 2024 సీజన్ కోసం మినీ వేలం 2023 డిసెంబర్ 19వ తేదీన దుబాయ్‍లో జరిగింది. ఈ వేలంలో కొందరు ఆటగాళ్లు రికార్డు స్థాయి ధర దక్కించుకున్నారు. ఈ మినీ వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న టాప్-10 ఆటగాళ్లు వీరే. 

Photo: IPL

ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్‌ను కోల్‍కతా నైట్ రైడర్స్ జట్టు రూ.24.75 కోట్లకు దక్కించుకుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా స్టార్క్ రికార్డు సృష్టించాడు.

Photo: PTI

ఆస్ట్రేలియా కెప్టెన్, ఆల్‍రౌండర్ ప్యాట్ కమిన్స్‌ను సన్‍రైజర్స్ హైదరాబాద్ జట్టు రూ.20.50కోట్ల భారీ ధరకు సొంతం చేసుకుంది.

Photo: PTI

న్యూజిలాండ్ ఆల్‍రౌండర్ డారిల్ మిచెల్‍ను చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ రూ.14కోట్లకు దక్కించుకుంది. 

Photo: PTI

భారత పేసర్ హర్షల్ పటేల్‍ను రూ.11.75 కోట్లకు కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్ టీమ్. 

Photo: PTI

వెస్టిండీస్ పేసర్ అల్జారీ జోసెఫ్‍ను రూ.11.50కోట్లకు తీసుకుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. 

Photo: AP

ఆస్ట్రేలియా బౌలర్ స్పెన్సెర్ జాన్సన్‍ను రూ.10కోట్లకు గుజరాత్ టైటాన్స్ జట్టు దక్కించుకుంది.

Photo: IPL

భారత దేశవాళీ క్రికెటర్, అన్‍క్యాప్డ్ ప్లేయర్ సమీర్ రిజ్వీని రూ.8.40కోట్ల భారీ ధరకు చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. 

Photo: Twitter

వెస్టిండీస్ ఆల్‍రౌండర్ రావ్‍మన్ పోవెల్‍ను రూ.7.40 కోట్లకు సొంతం చేసుకుంది రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ. 

Photo: IPL

భారత దేశవాళీ ప్లేయర్ కుమార్ కుశాగ్రాను రూ.7.20కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కొనుగోలు చేసింది. 

Photo: IPL

ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్‍ను రూ.6.80కోట్లకు సన్‍రైజర్స్ హైదరాబాద్ జట్టు దక్కించుకుంది.

Photo: PTI

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels