వంకాయలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులోని పోషకాలను తీసుకోవడం మన శరీరానికి చాలా అవసరం.

Unsplash

By Anand Sai
Sep 23, 2024

Hindustan Times
Telugu

కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ కూరగాయను తినకూడదు. ఎందుకంటే వంకాయ వినియోగం మీ ఆరోగ్య పరిస్థితిని మరింత దిగజార్చుతుంది.

Unsplash

ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వంకాయను తినకూడదో తెలుసుకుందాం..

Unsplash

గ్యాస్, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలు ఎక్కువగా ఉన్నవారు వీలైనంత వరకు వంకాయను తినకూడదు. దీని వల్ల జీర్ణ సమస్యలు పెరుగుతాయి.

Unsplash

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం రక్తహీనతతో బాధపడేవారు కూడా వంకాయ తినకూడదు. ఇందులో శరీరంలో ఐరన్ శోషణను తగ్గించే అంశాలు ఉంటాయి.

Unsplash

మూత్రపిండాల వ్యాధి లేదా రాళ్ళు ఉన్నవారు వంకాయను తినకూడదు. వంకాయలో ఆక్సలేట్ ఉంటుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి ఇది ప్రధాన కారణం.

Unsplash

కీళ్లనొప్పులతో బాధపడేవారు వంకాయ తినకూడదు. వంకాయలో సోలనిల్ ఉంటుంది. దీని వల్ల శరీరంలో వాపు, కీళ్ల నొప్పులు పెరుగుతాయి.

Unsplash

కొందరికి వంకాయ అంటే ఎలర్జీ. అలాంటివారు కూడా ఈ కాయగూరకు దూరంగా ఉంటే మంచిది.

Unsplash

ఉదయం ఉప్పు నీళ్లు తాగితే ఎన్ని లాభాలో - వీటిని తెలుసుకోండి

image credit to unsplash