పచ్చి ఉల్లిపాయ తింటే నోటి ఆరోగ్యానికి మంచిదా?

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Oct 05, 2024

Hindustan Times
Telugu

ఉల్లిపాయల్లో పోషకాలు చాలా ఉంటాయి. అందుకే వీటిని ప్రతీ రోజు వంటకాల్లో తీసుకోవటంతో పాటు పచ్చిగా తిన్నా ఎక్కువ ప్రయోజనాలు దక్కుతాయి. 

Photo: Pexels

పచ్చి ఉల్లిపాయ తింటే నోటి ఆరోగ్యానికి మంచిదా.. కాదా అనే సందేహం కొందరిలో ఉంటుంది. ఇవి తింటే నోరు వాసన వస్తుండటంతో ఈ సందేహం ఎక్కువగా వస్తుంది. అయితే, పచ్చి ఉల్లిపాయ తింటే నోటి ఆరోగ్యానికి ప్రయోజనాలు ఉంటాయి. 

Photo: Pexels

ఉల్లిపాయల్లో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబయల్ గుణాలు ఉంటాయి. దీనివల్ల నోటికి మేలు చేస్తాయి. 

Photo: Pexels

నోటిలోని హానికర క్రిములను పచ్చి ఉల్లిపాయ చంపేయగలదు. ఉల్లిపాయ తింటే క్రిముల ప్రభావం తగ్గుతుంది. 

Photo: Unsplash

పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల దంతాల దృఢత్వం కూడా పెరుగుతుంది. పంటి నొప్పి ఉన్న చోట ఉల్లిపాయతో రుద్దితే ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది. 

Photo: Unsplash

ఉల్లిపాయలు తినడం వల్ల గుండె, చర్మం, ఎముకలు, జుట్టు ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. కంటి చూపు కూడా మెరుగుపడేందుకు తోడ్పడుతుంది. 

Photo: Pexels

ఉల్లిపాయ రోజుకు పచ్చిగా సగం తింటే సరిపోతుంది. పచ్చి ఉల్లిపాయ తిన్న తర్వాత నోటి నుంచి వాసన ఎక్కువ వస్తుంది. అందుకే దీన్ని తిన్నాక నోటిని నీటితో శుభ్రం చేసుకుంటే మేలు. 

Photo: Unsplash

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels