నిమ్మకాయ, యూకలిప్టస్ నూనె - లెమన్ యూకలిప్టస్ ఆయిల్ దోమల సహజ వికర్షకాలలో ఒకటి. యూకలిప్టస్ నూనెలో నిమ్మకాయ రసం కలిపి ఈ మిశ్రమాన్ని తయారు చేసుకోవచ్చు. 3 ఏళ్ల కంటే తక్కువ వయస్సు పిల్లలకు ఈ మిశ్రమాన్ని ఉపయోగించకూడదు.
pexels
లావెండర్ - లావెండర్ పువ్వుల పొడి దోమలను తిప్పికొట్టగల సువాసన, నూనెను ఉత్పత్తి చేస్తాయి. లావెండర్ అనాల్జేసిక్, యాంటీ ఫంగల్, యాంటిసెప్టిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది దోమల బెడదను అరికట్టడమే కాకుండా చర్మాన్ని సున్నితంగా చేస్తుంది.
freepik
దాల్చిన చెక్క నూనె - దాల్చిన చెక్క నూనె దోమల గుడ్లను నాశనం చేస్తుంది. దోమలకు రెపలెంట్ గా పనిచేస్తుంది. 4 ఔన్సుల నీటికి 1/4 టీస్పూన్ ఈ నూనె కలిపి మిశ్రమాన్ని చర్మం, దుస్తులు, ఇంటి పరిసరాల్లో పిచికారీ చేయవచ్చు.
freepik
గ్రీక్ క్యాట్‌మింట్ ఆయిల్ - పుదీనా కుటుంబానికి చెందిన క్యాట్నిప్ నెపెటా పర్నాసికా దోమలను దూరం చేస్తుంది. ఈ మొక్కల నూనె 2 నుంచి 3 గంటల వరకు దోమలను సమర్థవంతంగా తిప్పికొట్టగలవు.
freepik
థైమ్ ఆయిల్ - మలేరియా దోమలను తరిమికొట్టడానికి థైమ్ ఆయిల్ ఉత్తమమైనది. థైమ్ ఆకులను కాల్చడం వల్ల 60 నుంచి 90 నిమిషాల వరకు దోమలు, కీటకాల బెడద ఉండదు. ఓ టీ స్పూన్ ఆలివ్ లేదా జోజోబా ఆయిల్ కు 4 చుక్కల థైమ్ ఆయిల్ కలపండి.
freepik
సోయాబీన్ నూనె -సోయాబీన్ ఆధారిత ఉత్పత్తులు దోమల నుంచి దీర్ఘకాలిక రక్షణను అందిస్తాయి. సోయాబీన్ నూనెతో పాటు, లెమన్‌గ్రాస్ నూనెను కూడా దోమ కాటు నుంచి రక్షించడానికి ఉపయోగపడుతుంది.