పుట్టగొడుగుల్లో చాలా ముఖ్యమైన పోషకాలు.. ప్రయోజనాలు ఇవే

Photo: Unsplash

By Chatakonda Krishna Prakash
Apr 03, 2024

Hindustan Times
Telugu

పుట్టగొడుగుల్లో (మష్రూమ్స్) చాలా విటమిన్స్, మినరల్స్, ఫైబర్ సహా చాలా పోషకాలు ఉంటాయి. ఇవి తింటే ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు జరుగుతుంది. పుట్టగొడుగుల్లో ఉండే ముఖ్యమైన పోషకాలు ఏవి.. అవి ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తాయంటే..

Photo: Unsplash

పుట్టగొడుగుల్లో సెలెనియమ్ పుష్కలంగా ఉంటుంది. ఇది  యాంటీఆక్సిడెంట్‍ కారకంగా ఉంటుంది. దీంతో పుట్టగొడుగులు తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. 

Photo: Unsplash

పుట్టగొడుగుల్లో రిబోఫ్లేవిన్, నియాసిన్, ప్యాంటోథెనిక్ బీ విటమిన్స్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి, జీర్ణక్రియకు, చర్మానికి, రక్తానికి మేలు చేస్తాయి. 

Photo: Unsplash

మష్రూమ్‍ల్లో బీటా గ్లెకాన్స్ ఎక్కువగా ఉంటాయి. దీంతో ఇవి తింటే డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది. గుండె ఆరోగ్యం కూడా మెరుగవుతుంది.  

Photo: Unsplash

పుట్టగొడుగుల్లో పొటాషియమ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది కండరాలకు, నాడీ వ్యవస్థకు ప్రయోజనాలు చేకూరుస్తుంది.

Photo: Unsplash

పుట్టగొడుగుల్లో కాపర్ పుష్కలంగా ఉంటుంది. అందుకే ఇవి తింటే ఎర్ర రక్తకణాల ఉత్పత్తి, ఎముకల దృఢత్వం పెరగడంలో కూడా సహకరిస్తాయి.

Photo: Unsplash

అధిక రక్తపోటును తగ్గించుకునే 5 యోగాసనాలు  

pexels