అధిక రక్తపోటును తగ్గించుకునే 5 యోగాసనాలు  

pexels

By Bandaru Satyaprasad
May 20, 2024

Hindustan Times
Telugu

అధిక రక్తపోటు - హై బీపీ అనేది రక్తనాళాలలో ఒత్తిడి చాలా ఎక్కువగా ఉన్నప్పుడు సంభవించే సాధారణ పరిస్థితి. చికిత్స తీసుకోకుండా వదలిస్తే ఇది ప్రమాదకరం. ఇది గుండె జబ్బులకు దారి తీస్తుంది.  

pexels

 బీపీని కంట్రోల్ లో ఉంచుకోవడానికి యోగా ఒక ప్రభావవంతమైన మార్గం. యోగా సాధన చేయడంతో రక్త పోటును కంట్రోల్ చేసుకోవచ్చని అధ్యయనాలు తెలుపుతున్నాయి. మీ రక్తపోటును కంట్రోల్ లో ఉంటే 5 యోగాసనాలు తెలుసుకుందాం.   

pexels

చైల్డ్స్ పోజ్ - బాలాసనం అని దీనిని పిలుస్తారు. ఈ ఆసనం ఒత్తిడిని తగ్గించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీంతో రక్తపోటు కంట్రోల్ ఉంటుంది.  

pexels

ఫార్వర్డ్ బెండ్ - కూర్చొని ముందుకు బెండ్ అవ్వడంతో వెన్నుముక సాగుతుంది. దీంతో మనసు ప్రశాంతతమైన పరిస్థితి ఏర్పడి రక్తపోటును తగ్గించడంలో సాయపడుతుంది.  

pexels

 హీరో పోజ్ - హీరో పోజ్ మనస్సును శాంత పరిచి, ఒత్తిడిని తగ్గిస్తుంది. దీంతో రక్తపోటు స్థాయిలు అదుపులోకి వస్తాయి. 

pexels

బౌండ్ యాంగిల్ పోజ్ - బౌండ్ యాంగిల్ పోజ్ తుంటి, గజ్జల ప్రాంతాన్ని సడలించి రక్తపోటును నిర్వహించడంలో సాయపడుతుంది. ఈ ఆసనం ఒత్తిడిని తగ్గించి ప్రశాంతత భావాన్ని ప్రోత్సహిస్తుంది.  

pexels

శవాసనం - శవాసనం అధిక రక్తపోటును తగ్గించడానికి ప్రభావవతంగా పనిచేస్తుంది. ఈ ఆసనం ఒత్తిడిని తగ్గించడానికి సాయపడుతుంది. ప్రశాంత స్థితిని ప్రేరేపిస్తుంది.  

pexels

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels