మీ పెదాలు గులాబీ రంగులో మెరుస్తూ ఉండాలనుకుంటున్నారా? యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉన్న ఈ 5 వంటింటి చిట్కాలను పాటించండి. ఈ చిట్కాలు మీ పెదాలను హైడ్రేట్‌గా ఉంచుతాయి, మీకు అందమైన పెదాలను అందిస్తాయి. 

pixabay

By Bandaru Satyaprasad
Dec 31, 2023

Hindustan Times
Telugu

బీట్‌రూట్ బామ్- ఇది మీ పెదవులకు సున్నితమైన గులాబీ రంగును జోడిస్తుంది. కొబ్బరి నూనెతో  బీట్‌రూట్ రసాన్ని కలిపి మీరు ఈ లిప్ బామ్‌ను తయారుచేసుకోవచ్చు. మీ పెదాలను హైడ్రేట్ గా, లేతరంగుగా ఉంచడానికి దీన్ని అప్లై చేయండి. 

pexels

నిమ్మరసం - అప్పుడే పిండిన నిమ్మరసాన్ని మీ పెదవులకు అప్లై చేయడం వల్ల నల్లటి మచ్చలను తగ్గిస్తుంది. దీని సహజమైన బ్లీచింగ్ లక్షణాల కారణంగా పెదల ఎరుపును మెరుగుపరుస్తుంది. దీన్ని ఎక్కువగా ఉపయోగించవద్దు, ఎందుకంటే పెదాలు పొడిగా మారవచ్చు. 

pexels

చూర్ణం చేసిన దానిమ్మ గింజలతో అద్భుతమైన ఎక్స్‌ఫోలియేటింగ్ స్క్రబ్‌ను తయారు చేయవచ్చు. మీ పెదవులపై ఈ చూర్ణాన్ని సున్నితంగా మసాజ్ చేయండి, డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించి, పెదాల సహజ రంగును పొందుతాయి.   

pexels

తేనె, గులాబీ రేకులు 

pexels

 గులాబీ రేకుల పొడిని తేనెతో కలిపి ఆ చూర్ణాన్ని పెదవులపై మాస్క్ లా అద్దండి. గులాబీ రేకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, తేనె మీ పెదాలను తేమ చేస్తుంది. దీన్ని అప్లై చేసి 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి.  ఆ తర్వాత మంచినీటితో శుభ్రం చేసుకోండి.  

pexels

కీరదోస ముక్కలు  

pexels

మీ పెదవులపై కీరదోస ముక్కలను ఉంచడం లేదా రుద్దడం వల్ల వాటిని హైడ్రేట్ చేయవచ్చు. ఇది పిగ్మెంటేషన్‌ను తగ్గించడానికి, దెబ్బతిన్న పెదవులను నయం చేయడానికి కూడా దోహదపడుతుంది.  

pexels

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels