మార్నింగ్ ఆఫ్టర్ మాత్రలు అరక్షిత సెక్స్ తర్వాత 120 గంటలలోపు తీసుకుంటే, అవాంఛిత గర్భం ఆపడానికి సహాయపడుతుంది. అయితే ఈ మాత్రల వల్ల కొన్ని దుష్ప్రభావాలు ఉన్నాయి.  

pexels

By Bandaru Satyaprasad
Nov 13, 2023

Hindustan Times
Telugu

మార్నింగ్ ఆఫ్టర్ పిల్ ఓవ్యులేషన్ నిరోధిస్తుంది లేదా ఆలస్యం చేస్తుంది.  అండాశయం నుంచి ఎగ్ విడుదలను నిరోధిస్తుంది. స్పెర్మ్ ఎగ్ ను చేరుకోవడం కష్టతరం చేస్తుంది. 

unsplash

అన్ని గర్భనిరోధక మాత్రలు మార్నింగ్ ఆఫ్టర్ పిల్ లాగా పనిచేయవని వైద్యులు తెలిపారు. గర్భనిరోధక మాత్రలు అత్యవసర గర్భనిరోధకంగా మాత్రమే ఉపయోగించడానికి అనుమతి ఉంది.  

pexels

మార్నింగ్ ఆఫ్టర్ పిల్ అసురక్షిత సంభోగం తర్వాత వీలైనంత త్వరగా తీసుకోవాలి. 72 గంటలలోపు తీసుకుంటే ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అయితే ఇది అత్యవసర పరిస్థితులలో మాత్రమే వినియోగించాలి.   

pexels

మార్నింగ్ ఆఫ్టర్ పిల్ ప్రభావం 72 గంటల తర్వాత గణనీయంగా తగ్గుతుంది. సాధారణంగా 120 గంటల తర్వాత ఈ మాత్ర పనిచేయదు.   

unsplash

అత్యవసర గర్భనిరోధక మాత్రలు దీర్ఘకాలిక ప్రభావాలను కలిగి ఉంటాయి. వికారం, వాంతులు కలిగించవచ్చు. పీరియడ్స్ సమయాన్ని మార్చవచ్చు, ముందుకు రావొచ్చు లేదా వాయిదా వేయవచ్చు.  

pexels

అత్యవసర గర్భనిరోధక పద్ధతులు ఏవీ 100 శాతం ప్రభావవంతంగా ఉండవు. పీరియడ్స్ తప్పితే మీ గైనకాలజిస్ట్‌ని సంప్రదించడం చాలా ముఖ్యం.   

pexels

మార్నింగ్ ఆఫ్టర్ మాత్రలు సులభంగా అందుబాటులో ఉంటాయి. కానీ ఇవి దీర్ఘకాలిక దుష్ప్రభావాలకు దారితీయవచ్చు. 

pexels

అల్లం, తులసి, బెల్లం మిశ్రమం చలికాలంలో పెరిగే జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యల నుండి రక్షించడానికి ఒక బెస్ట్ హోం రెమెడీ.

Unsplash