మునగాకులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన మిరాకిల్ ట్రీ మునగ.  

pexels

By Bandaru Satyaprasad
Aug 18, 2024

Hindustan Times
Telugu

మునగాకును పౌడర్, టాబ్లెట్లలో ఉపయోగిస్తారు. బరువు తగ్గడం, చర్మం, జుట్టు సంరక్షణకు మునగాకు ఉపయోగిస్తారు.  

pexels

మునగాకులో విటమిన్ ఎ, సి, ఈ, కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. శరీర ఆరోగ్యానికి ఈ విటమిన్లు ఎంతో ప్రయోజనకరం.  

pexels

మునగాకు తింటే మహిళల్లో హార్మోన్ల సమతుల్యం, పునరుత్పత్తిని మెరుగుపరుస్తుంది.  ఇందులోని ఫైటోఈస్ట్రోజెన్ కంటెంట్ మహిళల రిప్రొడక్టివిటీకి తోడ్పడుతుంది.  

pexels

మునగాకులోని ఐరన్ కంటెంట్ నీరసం, రక్త హీనతను తగ్గిస్తుంది. శరీరానికి కావాల్సిన ఎనర్జీని అందిస్తుంది.  

pexels

బాలింతలకు మునగాకు మేలు చేస్తుంది. సహాజంగా పాలు పెరగడానికి సహాయపడుతుంది.   

pexels

రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించేందుకు మునగాకు సహాయపడుతుంది. ఇది టైప్-2 డయాబెటిస్ ను నివారించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది.  

pexels

మునగాకులోని కాల్షియం, పాస్పరస్ ఎముకల బలాన్ని పెంచుతాయి. ముఖ్యంగా మహిళల్లో బోలు ఎముకల వ్యాధిని నివారిస్తుంది.  

pexels

వృద్ధాప్యం అనేది సహజమైన ప్రక్రియ. కానీ కొన్ని ఆహారాలు వృద్ధాప్యాన్ని మరింత వేగవంతం చేస్తాయి. మీరు మీ కంటే ఎక్కువ వయస్సు గలవారిలా కనిపిస్తారు. మీకు తెలియకుండానే మీ వయస్సును పెంచే 10 ఆహారాల గురించి తెలుసుకుందాం.  

pexels