వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచే 5 ఆహారాలివే!  

pexels

By Bandaru Satyaprasad
Jul 07, 2024

Hindustan Times
Telugu

వర్షాకాలంలో తేమ వాతావరణం బ్యాక్టీరియా ఉత్పత్తికి అనుకూలం, అలాగే ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. వర్షాకాలంలో రోగ నిరోధక శక్తిని పెంచే 5 ఆహారాలు తెలుసుకుందాం.  

pexels

అల్లం - అల్లం గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలిగించే వేడి లక్షణాలను కలిగి ఉంటుంది. అల్లంలో రోగనిరోధక శక్తిని పెంచే యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. 

pexels

వెల్లుల్లి - వెల్లుల్లిలో అల్లిసిన్ ఉంటుంది. ఇది తెల్ల రక్తకణాల ఉత్పత్తిని పెంచి ఇన్ఫెక్షన్లు, వైరస్ లను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది.  

pexels

నట్స్ - వాల్ నట్ లు, బాదం, వేరుశనగతో సహా నట్స్ రోగనిరోధక శక్తిని పెంచడానికి అవసరమైన విటమిన్లు, ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉంటాయి.  

pexels

కాకరకాయ - కాకరకాయలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి, ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది.  

pexels

బొప్పాయి   

pexels

బొప్పాయిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, అవసరమైన విటమిన్లు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.  

అల్లం, కీరదోస జ్యూస్ - కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే...!

image credit to unsplash