ఇంటర్నెట్ యుగంలో ప్రతి ఒక్కరూ ఆలోచన మారథాన్ చేస్తున్నారు. కొన్నిసార్లు ఒత్తిడి స్థాయిలు పెరిగి ఆలోచన తీవ్రత మన పరిధి దాటిపోతుంది. ప్రతికూల ఆలోచనలు మొదలవుతాయి. వీటిని అధిగమించడానికి వైద్యనిపుణులు కొన్ని చిట్కాలు చెబుతున్నారు.   

pexels

By Bandaru Satyaprasad
Feb 24, 2024

Hindustan Times
Telugu

మీ మనస్సును నియంత్రించడానికి చిట్కాలు- మనస్సును అదుపులో ఉంచుకునే జీవిత నైపుణ్యాన్ని నేర్చుకోవడం కాస్త కష్టం అనిపించవచ్చు, కానీ ప్రయత్నిస్తే నిరాశావాదం నుంచి బయటపడవచ్చు. 

pexels

మైండ్‌ఫుల్‌నెస్ సాధన -మైండ్‌ఫుల్‌నెస్ అంటే దృష్టి కేంద్రీకరించడం. అనుకున్న పనిని పూర్తిచేయడం, ఆహారం, బ్రష్ చేయడం, స్నానం చేయడం, నడవడం వంటి రోజువారీ దినచర్యలను సక్రమంగా ఆచరించగలిగే మైండ్‌ఫుల్‌నెస్‌ను సాధ్యపడుతుంది. 

pexels

గ్రౌండింగ్ టెక్నిక్స్ -  ఒక వ్యక్తి ప్రతికూల ఆలోచనల నుంచి బయటపడేందుకు, అతిగా ఆలోచించడం నుండి బయటపడటానికి ఈ పద్ధతులు పాటించండి.  మీ పాదాలను కదలకుండా నేలపై ఉంచండి. శ్వాస మీద ధ్యాస పెట్టడం, మీ పరిసరాలను పరిశీలించడం చేయండి.   

pexels

5 ఇంద్రియాల టెక్నిక్‌ - మరొక బెస్ట్ టెక్నిక్ 5-4-3-2-1 టెక్నిక్ లేదా 5 ఇంద్రియాల టెక్నిక్ మనస్సును కంట్రోల్ చేసుకోవడానికి సాయపడుతుంది. చూసి 5 వస్తువుల పేర్లు చెప్పడం, తాకి 4 వస్తువులను గుర్తుపట్టడం, వింటూ 3 వస్తువుల పేర్లు చెప్పడం, వాసనతో రెండింటిని గుర్తుపట్టడం, రుచి చూసి చెప్పడం. 

pexels

శ్వాస మీద ధ్యాస - ప్రతికూలత పరిస్థితుల నుంచి బయటపడటానికిశ్వాస మీద దృష్టి పెట్టడం మంచి టెక్నిక్. ఊపిరి తీసుకున్నప్పుడు, నిశ్వాసం చేసినప్పుడు శ్వాసను గమినిస్తే ఒత్తిడి తగ్గుతుంది.   

pexels

రోజువారీ దినచర్యను అనుసరించండి- అధిక ఆలోచనలను కంట్రోల్ చేసుకునేందుకు రోజువారీ దినచర్యను సరిదిద్దుకోవాలి.  ప్రతికూల ఆలోచనలకు కారణాలు గుర్తించి వాటికి దూరంగా ఉండాలి.   

pexels

జర్నలింగ్- మీ ఆలోచనలను కాగితంపై పెట్టడం చేస్తే అతిగా ఆలోచించే చిక్కుల నుంచి బయటపడవచ్చు.   

pexels

అబ్జర్వింగ్ థాట్స్ మెడిటేషన్- మైండ్ కంట్రోల్ కు ధ్యానం చక్కటి మార్గం.  ఒక వస్తువుపై దృష్టిని కేంద్రీకరించడానికి, మనసు లగ్నం చేయడానికి  ధ్యానం సహయపడుతుంది.   

pexels

నగ్నంగా వ్యాయామం చేయడం వల్ల ఆత్మవిశ్వాసం మెరుగుపడుతుంది. నగ్నంగా వర్క్ అవుట్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.  2016-17లో నేకెడ్ యోగా ఆన్‌లైన్‌లో విపరీతంగా ట్రెండ్ అయ్యింది.  

pexels