ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనే నానుడి ఉంది. ఉల్లిలో ఉన్న ఔషధ గుణాలతో ఆ గుర్తింపు వచ్చింది. రుచికి, వాసనకు వంటల్లోనే కాదు ఉల్లి ప్రయోజనాలు నిత్య జీవితంలో ఎన్నో ఉన్నాయి.

By Bolleddu Sarath Chandra
Oct 16, 2024

Hindustan Times
Telugu

ఉల్లిపాయల్లో చాలా రకాలు ఉంటాయి, వీటిలో ఎర్ర ఉల్లిపాయలు నాసిక్, సూరత్‌ రకాలుగా పేర్కొంటారు.తెల్ల ఉల్లిపాయల్లో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. వాటికి శరీరంలో వేడిని తగ్గించే గుణం ఉంటుంది. రక్తాన్ని శుద్ధి చేయడంలో కూడా ఉల్లిపాయలు ఉపయోగపడతాయి. 

ఔషధాల తయారీలో కూడా ఉల్లిపాయలు  వినియోగిస్తారు. ఆయుర్వేద ఔషధాల్లో తెల్ల ఉల్లిపాయలను వినియోగిస్తారు. 

తెల్ల ఉల్లిపాయల్ని  రోజూ తింటే మూల శంక వ్యాధి నయం అవుతుంది. ఉల్లిపాయలకు విష క్రిములను నాశనం చేసే స్వభావం ఉంటుంది. 

వంటకు వినియోగించే సమయంలో మాత్రమే ఉల్లిపాయలను ముందుగా తరుముకోవాలి. ముందే తరిగిన ఉల్లిపాయలను నిల్వ ఉంచితే విషతుల్యం అవుతాయి.

ఉదయం నిద్ర లేవగానే పళ్లు తోముకుని ఉల్లిపాయను నోట్లో వేసుకుని నమిలి మింగితే  బాక్టీరియా చనిపోతుంది.

కళ్లనొప్పులకు  ఉంటే శుభ్రమైన ఉల్లిపాయను మెత్తగా దంచి శుబ్రమైన పల్చటి గుడ్డలో చుట్టి ఉల్లిరసాన్ని కళ్లలో రెండు మూడు చుక్కలు వేస్తే కళ్ల నొప్పి తగ్గుతుంది

మూర్ఛ వ్యాధికి ఉల్లిపాయలు మంచి మందుగా పనిచేస్తాయి. మూర్ఛ వచ్చేటపుడు తెల్ల ఉల్లిని దంచి దాని రసం చెవిలో వేస్తే మూర్ఛ సమస్య తగ్గుతుంది.  వాంతులు తరచూ అవుతుంటే తరిగిన  ఉల్లిని తింటే తగ్గుతాయి. తేలు కాటుకు కూడా ఉల్లిపాయ ఔషధంగా పనిచేస్తాయి. తేలు కుట్టిన చోట ఉల్లి రసంతో రుద్దితే ఉపశమనం ఉంటుంది. 

సంతాన ప్రాప్తి లేనివారికి ధాతుపుష్టి లేని వారికి ఉల్లిపాయలు మేలు చేస్తాయి. ఈ సమస్యలు ఉన్న వారు ఆహారంలో ఉల్లిపాయలు ఎక్కువగా చేర్చుకుంటే కొంత ఫలితం ఉంటుంది. 

అల్లం, తులసి, బెల్లం మిశ్రమం చలికాలంలో పెరిగే జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యల నుండి రక్షించడానికి ఒక బెస్ట్ హోం రెమెడీ.

Unsplash