మనం సాధారణంగా మామిడి పండు గుజ్జు తిని తొక్కలు పడేస్తాం. అయితే గుజ్జుతో పాటు తొక్కల్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.   

pexels

By Bandaru Satyaprasad
Apr 17, 2024

Hindustan Times
Telugu

వేసవిలో మామిడి పండ్ల రుచిని ఆస్వాదిస్తుంటాం. మామిడి పండు మాత్రమే కాదు తొక్కలు కూడా ఆరోగ్యకరమైన పోషకాలను కలిగి ఉంటాయి. చర్మానికి ఉపశమనం, ఫేస్ మాస్క్ లా, టాంగీ టీని తయారీ ఇలా అనేక విధాలుగా తొక్కలను ఉపయోగించవచ్చు.  

pexels

యాంటీ డయాబెటిక్ లక్షణాలు- మామిడి తొక్క టీ లేదా డిటాక్స్ వాటర్ తాగడం వల్ల షుగర్ లెవల్స్ మెరుగుపడతాయి. మామిడి తొక్కలలో ఉండే మాంగిఫెరిన్ రక్తంలో షుగర్ స్థాయిలను, ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంతో సాయపడుతుంది.  

pexels

 సహాజ క్రిమిసంహారిణి - మామిడి తొక్కల్లోని మాంగిఫెరిన్, బెంజోఫెనోస్ తెగుళ్లు, కీటకాల నుంచి పంటలను రక్షించడానికి దీనిని సహజ క్రిమిసంహారిణిగా ఉపయోగించవచ్చు. 

pexels

యాంటీ ఇన్ల్ఫమేటరీ- మామిడి తొక్కల్లోని కొన్ని కాంపౌండ్స్ యాంటీ ఇన్ల్ఫమేటరీ లక్షణాలు కలిగి ఉంటాయి. ఇవి పేగుల్లో మంట, ఇతర సమస్యలు తగ్గించడానికి సాయపడతాయి.  

pexels

క్యాన్సర్ ను నివారిస్తుంది- కొన్ని అధ్యయనాల ప్రకారం, మామిడి తొక్కల నుంచి తయారు చేసిన పదార్థాలు యాంటీ క్యాన్సర్ లక్షణాలు కలిగి ఉంటాయి. మాంగిఫెరిన్ క్యాన్సర్ కణాలు పెరుగుదలను మందగించేలా చేస్తుంది.  

pexels

 మామిడి తొక్కలను ఎలా ఉపయోగించాలి? 

pexels

మామిడి తొక్కలను మామూలుగా తినవచ్చు లేదా గైండ్ర్ చేసుకుని చట్నీలుగా, స్మూతీలలో కలుపుకోవచ్చు. మాంగో పీల్స్ ను టీ లో లేదా డీ టాక్స్ వాటర్ లో కలుపుకోవచ్చు.    

pexels

అల్లం, తులసి, బెల్లం మిశ్రమం చలికాలంలో పెరిగే జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యల నుండి రక్షించడానికి ఒక బెస్ట్ హోం రెమెడీ.

Unsplash