మఖానా కేవలం కరకరలాడే చిరుతిండి మాత్రమే కాదు, ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం, కాల్షియం మరెన్నో పోషకాలు ఉంటాయి. మఖానాతో కలిగి 6 ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం.
pexels
మఖానాలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతాయి. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
unsplash
మీ దినచర్యలో మఖానా చేర్చుకోవడానికి మరో కారణం రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించే సామర్థ్యం. దీనిలోని తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది.
pexels
బరువు తగ్గడం మీ లక్ష్యం అయితే మఖానాను మీ ఫుడ్ లో యాడ్ చేసుకోండి. మఖానాలో తక్కువ కేలరీలు ఉంటాయి. ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటాయి. మఖానా తిన్నాక ఎక్కువసేపు కడుపు నిండుగా అనిపించి తొందరగా ఆకలి వేయదు.
pexels
మఖానా గుండెకు అనుకూలమైన చిరుతిండి. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ప్రోటీన్, ఫైబర్, జింక్ ఉన్నాయి. ఇవి రక్తపోటును నిర్వహించడానికి, గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి సహాయపడతాయి.
pexels
మఖానాలోని యాంటీ ఆక్సిడెంట్లు, అమినో యాసిడ్ లు మీ చర్మాన్ని యవ్వనంగా, ప్రకాశవంతంగా ఉంచడంలో ముడతలు తగ్గించడంలో సహాయపడతాయి.
pexels
మఖానా ఆర్థరైటిస్ తో బాధపడుతున్న వారికి సహాయపడుతుంది. వీటిలోని యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు కీళ్ల నొప్పులు తగ్గించడంలో సహాపడతాయి. ఎముకల దృఢత్వాన్ని మెరుగుపరుస్తుంది.
pexels
అల్లం, తులసి, బెల్లం మిశ్రమం చలికాలంలో పెరిగే జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యల నుండి రక్షించడానికి ఒక బెస్ట్ హోం రెమెడీ.