లిచీ ఫ్రూట్ తో 5 ఆరోగ్య ప్రయోజనాలు  

pexels

By Bandaru Satyaprasad
May 21, 2024

Hindustan Times
Telugu

వేసవి కాలంలో ఇష్టంగా తినే పండ్లలో లిచీ ఒకటి. లిచీ పండ్లలోని యాంటీ ఆక్సిడెంట్లు..శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడానికి, ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడానికి సాయపడతాయి. లిచీ తింటే కలిగి 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.  

pexels

యాంటీ ఆక్సిడెంట్లు - లిచీ ఫ్రూట్ లో పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్లు, ప్రోయాంతోసైనిడిన్లు ఉంటాయి. ఇవి శరీరంలో రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి, బరువును తగ్గించడానికి, హానికరమైన UV కిరణాల నుంచి చర్మాన్ని రక్షించడానికి సాయపడతాయి.  

pexels

బరువు తగ్గడానికి -లిచీలో తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇవి బరువు నిర్వహణకు సాయపడతాయి.  

pexels

షుగర్ లెవల్స్ కంట్రోల్ - లిచీ పండ్లతో మరో ముఖ్యమైన ప్రయోజనం ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంపొందింటే సామర్థ్యం. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కీలకం. లిచీలో సహజమైన చక్కెరలు ఉంటాయి.  

pexels

మెరిసే చర్మం - లిచీ ఫ్రూట్ లోని పాలీఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎలాస్టిసిటీ, హైడ్రేషన్ కు దోహద పడుతుంది. చర్మం ముడతల తగ్గించడానికి సాయపడుతుంది. ఇందులోని యాంటీ మైక్రోబయల్ లక్షణాలు మెరిసే చర్మాన్ని అందిస్తాయి.  

pexels

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. 

pexels

లిచీలో అధికంగా ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంటు వ్యాధులను నిరోధించే శక్తిని శరీరానికి ఇస్తుంది. గుండె, కాలేయం, మెదడు ఆరోగ్యానికి మంచిది.  

pexels

అల్ల నేరేడు పండు తింటున్నారా..? ఆరోగ్య ప్రయోజనాలివే