రక్తహీనత అంటే శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉండడం. తక్కువ హిమోగ్లోబిన్ స్థాయిలకు సంకేతాలు, సహజంగా హిమోగ్లోబిన్ పెంచుకునే మార్గాలు తెలుసుకుందాం.
pixabay
By Bandaru Satyaprasad Jun 01, 2024
Hindustan Times Telugu
హిమోగ్లోబిన్ ఎర్ర రక్త కణాలలోన్ని ప్రోటీన్, ఇది ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్‌ను శరీరంలోని వివిధ కణజాలాలకు, అవయవాలకు రవాణా చేస్తుంది.
pixabay
శరీర పనితీరును మెరుగుపరచడానికి హిమోగ్లోబిన్ స్థాయిలను నిర్వహించడం చాలా ముఖ్యం. హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉంటే రక్తహీనతకు సంకేతం. రక్తహీనత శరీరంలో ఆక్సిజన్ కొరతకు దారితీస్తుంది. దీంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
pixabay
సాధారణ హిమోగ్లోబిన్ స్థాయిలు పురుషులకు 14 నుంచి 18 g/dl మధ్యలో ఉండాలి. స్త్రీలకు 12 మరియు 16 మధ్య ఉండాలి. హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గినప్పుడు శరీరం తగినంత ఆక్సిజన్‌ను పొందలేక చాలా నీరసంగా అనిపిస్తుంది.
pexels
తక్కువ హిమోగ్లోబిన్ స్థాయిలకు సంకేతాలు- గోర్లు పెళుసుగా ఉండడం, ఒళ్లు నొప్పులు, ఛాతీలో నొప్పి, తల తిరగడం, బలహీనత, అలసట,
కాళ్లు, చేతులు చల్లగా అవ్వడం, పాలిపోయిన చర్మం, తలనొప్పి, చిరాకు, శ్వాస ఇబ్బందులు, ఏకాగ్రత సమస్యలు, నిద్ర పట్టకపోవడం,
గొంతు వాపు, గుండె వేగం పెరగడం.
pexels
హిమోగ్లోబిన్‌ను ఎలా పెంచుకోవాలి- సహజంగా హిమోగ్లోబిన్ కౌంట్‌ను పెంచుకోవడానికి కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి.
pexels
ఐరన్ రిచ్ ఆహారాలు - ఐరన్ హిమోగ్లోబిన్ ఉత్పత్తిని పెంచుతుంది. మీ ఆహారంలో మాంసం, చేపలు, పౌల్ట్రీ, బీన్స్, చిక్కుళ్లు, గుడ్లు, ఆకుకూరలు, గింజలు వంచి ఐరన్-రిచ్ ఫుడ్స్‌ను ఎక్కువగా చేర్చుకోవచ్చు .
pexels
విటమిన్ సి - విటమిన్ సి రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. నారింజ, బ్రోకలీ, బెల్ పెప్పర్స్, ద్రాక్ష, టమాటాలు, బొప్పాయి, బ్రస్సెల్స్ మొలకలు విటమిన్ సి అధికంగా ఉండే కొన్ని ఆహారాలు.
pexels
రేగు ఆకుల టీ- రేగు ఆకుల్లో విటమిన్ సి, ఐరన్ అధికంగా ఉంటాయి. ఈ టీ తాగితే హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది.
pexels
విటమిన్ B12 ఆహారాలు, విటమిన్ ఎ ఆహారాలు, హైడ్రేటెడ్ ఉండడం, దానిమ్మ కాయలు, రెగ్యులర్ గా వ్యాయామం, టీ,కాఫీ పరిమితం చేయడం- రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతాయి.
pexels
చలికాలంలో ఈ జ్యూస్‍తో మెండుగా రోగ నిరోధక శక్తి.. రోజూ తాగండి!