డయాబెటిస్ కోసం గ్లెసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే 5 కూరగాయలు

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Oct 27, 2024

Hindustan Times
Telugu

డయాబెటిస్ ఉన్న వారు ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. గ్లెసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఫుడ్స్ తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్‍లో ఉంటాయి. అలా, గ్లెసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఐదు రకాల కూరగాయలు ఇవి. 

Photo: Pexels

క్యారెట్‍లో గ్లెసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. డయాబెటిస్ ఉన్న వారు క్యారెట్‍ను తినడం మేలు. బ్లడ్ షుగర్ స్థాయిలు అదుపులో ఉండేందుకు ఇది సహకరిస్తుంది. 

Photo: Pexels

బ్రోకలీ కూడా డయాబెటిస్ ఉన్న వారు తినేందుకు సూటయ్యే కూరగాయ. దీంట్లోనూ గ్లెసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. బ్లడ్ షుగర్ కంట్రోల్‍కు ఇది తోడ్పడుతుంది. 

Photo: Pexels

క్యాబేజీలోనూ గ్లెసెమిక్ ఇండెక్స్ స్వల్పంగా ఉంటుంది. డయాబెటిస్ మేనేజ్‍మెంట్‍కు ఇది తోడ్పడుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ హఠాత్తుగా పెరగకుండా చేయగలదు. 

Photo: Pexels

చిక్కుడు కాయల్లోనూ గ్లెసెమిక్ ఇండెక్స్ తక్కువే. డయాబెటిస్ ఉన్న వారు చిక్కుడు తినొచ్చు. 

Photo: Pexels

క్యాప్సికంలోనూ గ్లెసెమిక్ ఇండెక్స్ స్వల్పంగానే ఉంటుంది. శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గేందుకు ఇది తోడ్పడుతుంది. కొలెస్ట్రాల్ తగ్గేందుకు కూడా సహకరిస్తుంది.

Photo: Pexels

ఏదైనా విటమిన్ లోపం శరీరం పనితీరును ప్రభావితం చేస్తుంది. ప్రపంచంలో చాలా మంది ప్రజలు విటమిన్లు, ఖనిజాల లోపాలతో బాధపడుతున్నారు.

Unsplash