ఆక్సిటోసిన్ లేదా లవ్ హార్మోన్ ఆరోగ్యకరమైన సంబంధాలను, భావోద్వేగ అనుబంధాలను నిర్మించడంలో సహాయపడుతుంది. కాబట్టి ఆక్సిటోసిన్‌ను ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం.
pexels
By Bandaru Satyaprasad Aug 03, 2024
Hindustan Times Telugu
సోషల్ కనెక్షన్, లైంగిక పునరుత్పత్తి, ఒత్తిడి, ఆందోళన తగ్గించం, ప్రసవం, ప్రసవం తర్వాత ఆక్సిటోసిన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఆక్సిటోసిన్ ఒక శక్తివంతమైన న్యూరోపెప్టైడ్. ఇది మెదడులో హార్మోన్‌గా, న్యూరోట్రాన్స్‌మిటర్‌గా పనిచేస్తుంది.
pexels
ఆక్సిటోసిన్ లైంగిక కార్యకలాపాల సమయంలో విడుదల అవుతుంది. ఇది భాగస్వాముల మధ్య భావోద్వేగ సాన్నిహిత్యాన్ని, బంధాన్ని పెంచుతుంది.
pexels
ఫిజికల్ టచ్- కౌగిలించుకోవడం, చేతులు పట్టుకోవడం వంటి భౌతిక స్పర్శ ఆక్సిటోసిన్‌ను పెంచడానికి ప్రత్యక్ష మార్గం. ఈ ఫిజికల్ కనెక్షన్ లవ్ మేకింగ్ పై మెదడుకు సంకేతాలు ఇస్తుంది. ఇది ఆక్సిటోసిన్ స్థాయిలను పెంచుతుంది.
pexels
ఇష్టమైన వారితో సమయాన్ని గడపడం - స్నేహితులు, కుటుంబ సభ్యులతో అర్థవంతమైన సమయాన్ని గడపడం వల్ల ఆక్సిటోసిన్ లెవల్స్ పెరుగుతాయి. మీ భావాలను పంచుకున్నప్పుడు, కలిసి వంట చేయడం, ఆటలు ఆడటం, కలిసి సంగీతం వినడం.. బంధాలను బలపరుస్తాయి.
pexels
దయాగుణం- మీరు ఇతరులకు సహాయం చేసినప్పుడు సాధారణ చర్యల ద్వారా మీ మెదడు ఆక్సిటోసిన్‌ను విడుదల చేస్తుంది. ఇది ఆనందం, సంతృప్తి భావాన్ని సృష్టిస్తుంది.
pexels
పెట్ థెరపీ - పెంపుడు జంతువులతో సమయం గడపడం ఆక్సిటోసిన్ స్థాయిలపై ప్రభావాన్ని చూపుతుంది. కుక్కలు, పిల్లులపై ప్రేమ ఒత్తిడి భావాలను తగ్గిస్తుంది. మీ మనసును ప్రశాంతంగా ఉంచి, ఆక్సిటోసిన్‌ని పెంచుతాయి.
pexels
మైండ్‌ఫుల్‌నెస్, ధ్యానం - మైండ్‌ఫుల్‌నెస్, ధ్యానం మీతో మీరు కనెక్ట్ అవ్వడంలో సహాయపడతాయి. శ్వాసపై దృష్టి పెట్టడం ప్రశాంతమైన మానసిక స్థితిని సృష్టిస్తుంది.
pexels
నవ్వు - ఆక్సిటోసిన్‌ని పెంచడానికి నవ్వు ఒక శక్తివంతమైన మార్గం. మీరు స్నేహితులు, కుటుంబ సభ్యులతో సరదాగా నవ్వుతూ ఉంటే మీ బంధం మరింత బలపడుతుంది. ఫన్నీ మూవీస్ చూడటం, జోకులు వేసుకోడం మానసిక స్థితిని తేలికపరుస్తుంది.
pexels
సంగీతం, శారీరక వ్యాయామం, కృతజ్ఞతాభావం ఆక్సిటోసిన్ స్థాయిలను మెరుగుపరుస్తాయి.
గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి