విటమిన్​ 'కే' లోపంతో అనేక ఆరోగ్య సమస్యలు.. ఈ ఫుడ్స్​ బెస్ట్​!

Pixabay

By Sharath Chitturi
Sep 24, 2023

Hindustan Times
Telugu

విటమిన్​ కే లోపంతో రక్తం సరిగ్గా గడ్డకట్టదు. ఫలితంగా గాయమైతే బ్లీడింగ్​ ఎక్కువగా జరిగి, అధికంగా రక్తం పోతుంది. ఎముకలు బలహీనపడతాయి.

Pixabay

అందుకే శరీరానికి విటమిన్​ కే చాలా అవసరం. విటమిన్​ కే1, విటమిన్​ కే2 కాంపౌండ్స్​ కలయికే ఈ విటమిన్​ కే.

Pixabay

19ఏళ్లు పైబడిన పురుషులకు రోజుకు 120 మైక్రోగ్రాముల విటమిన్​ కే అవసరం ఉంటుంది. అదే మహిళల శరీరానికి 90 మైక్రోగ్రాముల విటమిన్​ కే అందాలి.

Pixabay

100 గ్రాముల పాలకూరలో 483 మైక్రోగ్రాముల విటమిన్​ కే ఉంటుంది. బ్రోకలీలో అది 100 మైక్రోగ్రాములు.

Pixabay

ఒక కప్పు ఎర్ర ముల్లంగి దుంపలతో 426 మైక్రోగ్రాముల విటమిన్​ కే లభిస్తుంది. ఈ దుంపలతో షుగర్​ లెవల్స్​ కూడా తగ్గుతాయి.

Pixabay

గుడ్లు, స్టాబెర్రీలు, మాంసంలో కూడా పుష్కలంగా విటమిన్​ కే ఉంటుంది.

Pixabay

అయితే విటమిన్​ కే సప్లిమెంట్స్​ను వాడకూడదు. వైద్యులు సూచిస్తేనే సప్లిమెంట్లు తీసుకోవాలి.

Pixabay

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels