సాధారణంగా మన ఇండ్లలో కాస్త ఎక్కువ అన్నం వండుతుంటారు. మిగిలిపోయిన అన్నంను ఫ్రిజ్ లో నిల్వ చేసుకుని, మరుసటి రోజు తింటుంటాం. మిగిలిపోయిన అన్నం తినడం ఆరోగ్యకరమా? కాదా? తెలుసుకుందాం.
pexels
By Bandaru Satyaprasad Oct 15, 2024
Hindustan Times Telugu
మిగిలిపోయిన అన్నం తినడం సురక్షితం కాదు. అది మిమ్మల్ని అనారోగ్యానికి గురిచేస్తుంది. అన్నంలో బాసిల్లస్ సెరియస్ అనే బ్యాక్టీరియా ఉంటుంది. అన్నం నిల్వ ఉంచినప్పుడు బ్యాక్టీరియా స్పోర్స్ సంఖ్య పెరిగి, టాక్సిన్స్ ను ఉత్పత్తి చేస్తాయి. దీని వల్ల కలిగే ఫుడ్ పాయిజన్ ను ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్ అంటారు.
pexels
రైస్ ను గది ఉష్ణోగ్రత వద్ద రెండు గంటల కంటే ఎక్కువసేపు ఉంచినట్లయితే ఇందులోని బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుంది. అన్నాన్ని తిరిగి వేడిచేసినా అనారోగ్య ప్రమాదాన్ని తొలగించలేకపోవచ్చు.
pexels
బాసిల్లస్ సెరియస్ బ్యాక్టీరియాతో కలుషితమైన అన్నం తింటే ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలు సంభవించవచ్చు. వికారం, వాంతులు, అతిసారం, పొత్తికడుపు నొప్పి రావొచ్చని వైద్య ఉనిపుణులు అంటున్నారు.
pexels
వండిన అన్నం చెడిపోకుండా, బ్యాక్టీరియా కలుషితాల వల్ల కలిగే అనారోగ్యాలను నివారించడానికి సరైన నిల్వ అవసరం. మిగిలిపోయిన అన్నంను సురక్షితం నిల్వ చేసుకోవాలి.
pexels
త్వరగా చల్లార్చండి - వండిన అన్నంను త్వరగా చల్లారేలా చేయాలి. వేడి వాతావరణంలో వృద్ధి చెందే బ్యాక్టీరియాను నిరోధించడానికి రైస్ ను త్వరగా చల్లబరచడం చాలా ముఖ్యం.
pexels
గాలి చొరబడని కంటైనర్లలో నిల్వ- రైస్ చల్లబడిన తర్వాత శుభ్రమైన, గాలి చొరబడని పాత్రల్లోకి మార్చండి. గాలి తగిలితే బ్యాక్టీరియా వృద్ధికి కారణం కావొచ్చు.
pexels
రిఫ్రిజిరేషన్ - అన్నం వండిన తర్వాత చల్లార్చి.. ఒక గంటలోపు రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేసుకోవచ్చు. తద్వారా బ్యాక్టీరియా పెరుగుదల ప్రమాదం తగ్గుతుంది. అన్నాన్ని రిఫ్రిజిరేటర్‌లో 40 డిగ్రీల ఫారెన్‌హీట్ వద్ద లేదా అంతకంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయవచ్చు.
pexels
మిగిలిపోయిన అన్నాన్ని మళ్లీ వేడి చేయడం ద్వారా ఆహారం ద్వారా సంక్రమించే వ్యాధులను కొద్దిమేర నివారించవచ్చు. వేడి చేయడం వల్ల మళ్లీ బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి తగిన నీళ్లు చల్లి, నీటి ఆవిరిపై వేడి చేసుకోవడం ఉత్తమం.
pexels
చలికాలంలో ఈ జ్యూస్‍తో మెండుగా రోగ నిరోధక శక్తి.. రోజూ తాగండి!