నవ్వడం ఒక భోగం, నవ్వకపోవడం ఓ రోగం. ఇది వాస్తవమే అంటున్నారు వైద్యులు. నవ్వు కేవలం ఒక సరదా మాత్రే కాదు, మీ ఆరోగ్యాన్ని పెంపొందించే సాధనం. నవ్వడం వల్ల కలిగే 7 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.  

pexels

By Bandaru Satyaprasad
Nov 13, 2024

Hindustan Times
Telugu

ఒత్తిడిని తగ్గిస్తుంది - మీరు ఒత్తిడికి గురైనప్పుడల్లా ఈ ట్రిక్ పాటించండి. నవ్వు ఒత్తిడిని తగ్గించే ఎండార్ఫిన్ లను విడుదల చేస్తుంది. ఇది ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ స్థాయిలను తగ్గి్స్తుంది.  

pexels

మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది - రెగ్యులర్ గా నవ్వడం వల్ల ఆందోళన, నిరాశ లక్షణాలు తగ్గుతాయి. నవ్వడం వల్ల మెదడులో సెరోటోనిన్ స్థాయిలను పెంచి, జీవితం పట్ల సానుకూల అనుభూతిని పెంచుతుంది. 

pexels

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది - నవ్వడం వల్ల రోగ నిరోధక కణాలు, యాంటీ బాడీల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది అనారోగ్యం నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. ఇది రోగ నిరోధక పనితీరును మెరుగుపరుస్తుంది.  

pexels

శరీర నొప్పులను తగ్గిస్తుంది - నవ్వడం వల్ల ఎండార్ఫిన్ లు విడుదలై సహజ నొప్పి నివారిణిగా పనిచేస్తాయి. ఇవి శరీర నొప్పులను తగ్గిస్తాయి. మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి.  

pexels

రక్తపోటు నిర్వహణ - నవ్వు రక్తనాళాలను విస్తరించి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. రక్తపోటును తగ్గిస్తుంది. హైపర్ టెన్షన్ ను నిర్వహించడానికి నవ్వు ఒక మంచి సహజ మార్గం. 

pexels

స్లీప్ సైకిల్ ను మెరుగుపరుస్తుంది - మీకు రాత్రిళ్లు నిద్రపట్టడం లేదా? అయితే లాఫింగ్ థెరఫీ ప్రయత్నించండి. ఇది శరీరం, మనస్సును రిలాక్స్ చేస్తుంది. ఒత్తిడిని తగ్గించి నిద్రపట్టడానికి సహాయపడుతుంది.  

 దీర్ఘాయువును పెంచుతుంది - తరచుగా నవ్వేవారు ఎక్కువ కాలం జీవిస్తారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఒత్తిడిని తగ్గించి, రోగ నిరోధక శక్తిని మెరుగుపర్చడం వల్ల... ఆరోగ్య స్థితి మెరుగుపడి ఆయుర్థాయం పెరగడానికి సహాయపడుతుంది.  

pexels

చలికాలంలో పాలల్లో పసుపు కలిపి తాగితే ఎన్ని లాభాలో తెలుసా?

Photo: Pexels