కొత్తి మీరను ప్రతి కూరలో వేస్తుంటాం. ఇది వంట రుచిని పెంచుతుంది. కొత్తి మీరలో అనేక ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉంటుంది. కొత్తి మీర ఆకులను తాజాగా ఉంచుకునేందుకు ఈ 6 చిట్కాలు ఫాలో అవ్వండి.
pexels
By Bandaru Satyaprasad Nov 06, 2024
Hindustan Times Telugu
కొత్తి మీరను వంటలలో లేదా పానీయాలలో ఉపయోగించడం కోసం వాటిని సరిగ్గా నిల్వ చేయడం చాలా అవసరం. తాజాగా ఉన్న కొత్తిమీర వంట రుచిని మరింత పెంచుతుంది.
కొత్తి మీర ప్రయోజనాలు - కొత్తి మీర జీర్ణ క్రియను ప్రోత్సహించడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహిస్తుంది. కొత్తి మీర ఆకులను వంటలలో, పానీయాల్లో జోడిస్తే అది పరిపూర్ణ పదార్థంగా అనిపిస్తుంది.
pexels
కొత్తి మీరను ఎక్కువ రోజులు నిల్వ చేసుకునేందుకు... ఈ ఆకులను జిప్ లాక్ బ్యాగ్ లో నిల్వ చేయండి. ఈ పద్ధతిలో కొత్తి మీర ఎక్కువ కాలం తాజాగా ఉంచవచ్చు.
కొత్తి మీర ఆకులను శుభ్రం చేసి, తగినంత నీటితో ఉన్న ఒక కూజాలో వేయండి. ఇలా చేస్తే కొత్తి మీర తాజాగా, ఆకుపచ్చగా ఉంటుంది.
కొత్తి మీర ఆకులను కత్తిరించి గాలి చొరబడని కంటైనర్లలో నిల్వ చేయండి.
pexels
కొత్తిమీర కాడలను శుభ్రం చేసి మొత్తని గుడ్డతో చుట్టండి. ఈ విధానం ఆకులను రోజంతా తాజాగా ఉంచుతుంది.
pexels
కొత్తిమీర కాడలను శుభ్రం చేసి, కొత్తిమీర ఆకులను ఒక గుడ్డలో ఉంచండి. రాత్రంతా ఫ్రిజ్ లో ఉంచి ఆ తర్వాత ఆకులను కోసి గాలి చొరబడని బాక్స్ లో ఉంచుకోండి.
pexels
లంచ్ బాక్స్ లో టిష్యూ పేపర్లను రెండు పొరలుగా వేసి, ఆకులను కడగకుండా నిల్వ చేయండి. ఈ పద్దతి ఆకులను తాజాగా ఉంచుతుంది.
pexels
శరీరంలో కొలెస్ట్రాల్‍ను సహజంగా తగ్గించగల పండ్లు ఇవి