అల్లం టీతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. వెయిట్ లాస్ కూడా!
Pixabay
By Sharath Chitturi Sep 16, 2023
Hindustan Times Telugu
జీర్ణ సమస్యలను దూరం చేసే శక్తి అల్లం సొంతం. అల్లం టీతో జీర్ణక్రియ ప్రక్రియ మెరుగుపడుతుంది.
Pixabay
రోజూ అల్లం తీసుకునే వారికి హైపర్టెషన్స్ ఉండదని అధ్యయనం సూచిస్తోంది. అల్లం టీ తీసుకుంటే బ్లడ్ ప్రెజర్‌ను తగ్గించుకోవచ్చు.
pixabay
ఊభకాయాన్ని తగ్గించేందుకు అల్లం ఉపయోగపడుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అల్లం ఛాయ్ మీద ప్రత్యేకించి పరిశోధనలు చేయలేదు.. కానీ దీనితో వెయిట్ లాస్ అయ్యే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు.
pixabay
అల్లం టీ తాగితే తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలు తగ్గుతాయి.
pixabay
అల్లంలో యాంటీఆక్సిడెంట్స్ మెరుగ్గా ఉంటాయి. వీటి ద్వారా కేన్సర్‌ను నివారించే అవకాశం ఉంటుంది.
pixabay
అయితే అల్లం ఛాయ్ అందరికి పడదు! కొందరిలో కడుపు మంట, ఉబ్బడం వంటి సమస్యలు వస్తాయి. లో-బీపీ ఉన్న వారు అల్లం టీని తక్కువ తీసుకోవడం మంచిది.
Pixabay
ఉదయాన్నే అల్పాహారం తర్వాత ఈ జింజర్ టీ తీసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి.
Unsplash
గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి