వినాయకుని రూపం చెప్పే గొప్ప సైకాలజీ లెస్సన్స్

pixabay

By Koutik Pranaya Sree
Sep 06, 2024

Hindustan Times
Telugu

వినాయకుని రూపమే గొప్ప పాఠం. . తల, కళ్లు, చెవులు, బొజ్జ... ఆయన రూపం నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి సూత్రాలున్నాయి. 

pixabay

వినాయకుని చిన్న కళ్లు ప్రతి విషయంలోనూ సూక్ష్మదృష్టి, నిషిత పరిశీలన ఉండాలని చెబుతాయి.

pixabay

ఒక విరిగిన దంతం.. గొప్ప పనుల కోసం కొన్ని త్యాగాలు చేయాలని చెబుతుంది. (మహాభారతం రాయడానికి ఆటంకం కలగకుండా గణేషుడు దంతాన్ని విరిచి కలం లాగా వాడాడు. )

pixabay

వినాయకుని పెద్ద చెవులు ప్రతిదీ స్పష్టంగా వినాలని చెబుతాయి. అన్నీ విని అందులో అవసరం ఉన్న విషయాలు మాత్రమే గ్రహించాలని దాని అంతరార్థం.  

pixabay

పెద్ద తల ఎక్కువ తెలివితేటలను, జ్ఞానం సంపాదించాలనీ, ఆలోచనలు పెద్దగా ఉంటేనే పెద్ద లక్ష్యాలు సాధించగలమనీ చెబుతుంది. 

pixabay

గణేషుని చిన్న నోరు తక్కువగా మాట్లాడాలనీ, ఎక్కువగా చేయాలనీ చెబుతుంది. 

pixabay

వినాయకుని చేతిలో ఉండే గొడ్డలి ఆయన ఆటంకాలు తొలగించే విఘ్నేశ్వరుడని తెలియజేస్తుంది. ఏ పనిలోనైనా ఆటంకాలు వస్తే వాటిని దాటుతూ ముందుకెళ్లాలని అర్థం.

pixabay

దానిమ్మ తొక్కల పొడితో టీ - ఈ ప్రయోజనాలు తెలుసుకోండి

image credit to unsplash