అసలే వర్షాకాలం... ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి...!

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Jul 21, 2024

Hindustan Times
Telugu

వర్షాకాలంలో అనేక వ్యాధులు వెంటాడుతాయి. ఈ సీజన్‌లో కొంచం అజాగ్రత్తగా వ్యవహరిస్తే రోగాల బారిన పడేందుకు ఎక్కువ సమయం పట్టదు. అందుకే జాగ్రత్తగా ఉండాలి.

image credit to unsplash

ఇంట్లో దోమలు లేకుండా చూసుకోవడం మంచిది. ఎక్కుడ దోమలు కనిపించినా తేలిగ్గా తీసుకోకుండా వీలైనంత త్వరగా వాటిని చంపేయండి.

image credit to unsplash

డెంగ్యూ, మలేరియా రాకుండా ఉండాలంటే దోమలను నివారించడం చాలా ముఖ్యం. కాబట్టి, ఈ సీజన్‌లో ఉదయం లేదా సాయంత్రం అయినా పూర్తి చేతుల దుస్తులను ధరించండి. తద్వారా దోమలు కుట్టకుండా నివారించవచ్చు.

image credit to unsplash

ఈ వర్షాకాలంలో వేడి వేడిగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. రాత్రి నిల్వ ఉంచిన వాటికి దూరంగా ఉండటం చాలా మంచిది.

image credit to unsplash

ఆరోగ్యంగా ఉండాలంటే పుష్కలంగా నిద్రపోవడం చాలా ముఖ్యం. డిప్రెషన్, మలబద్ధకం, అధిక రక్తపోటు కాకుండా, నిద్ర లేమి కారణంగా అనేక వ్యాధులు మిమ్మల్ని చుట్టుముడతాయి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

image credit to unsplash

ఏమైనా అనారోగ్యంగా అనిపిస్తే వెంటనే డాక్టరను సంప్రదించాలి. సొంతం వైద్యంతో సరిపెట్టడుకోవటం ఏ మాత్రం మంచిదికాదు.

image credit to unsplash

రెగ్యులర్ వ్యాయామం ఆరోగ్యకరమైన శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వ్యాయామం కోసం రోజుకు 30 నిమిషాలు కేటాయించండి.   వర్షాకాలంలో బయట నడకకు వెళ్లలేకపోతే, ఇంట్లోనైనా వ్యాయామం చేయండి.

image credit to unsplash

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels