టమాటా సాస్, కెచప్ మధ్య తేడా ఏంటి?

freepik

By Koutik Pranaya Sree
Sep 17, 2024

Hindustan Times
Telugu

కెచప్ తియ్యగా, పుల్లగా ఉంటుంది. సాస్ కాస్త ఉప్పగా ఉంటుంది.

freepik

టమాటా గుజ్జు ఉడికించి వడకట్టి, వెనిగర్, పంచదార, ఉప్పు కలిపి కెచప్ తయారు చేస్తారు.   టమాటాలు, మరికొన్ని కూరగాయలు, మిరియాలు, దినుసులు కలిపి ఉడికించి సాస్ తయారు చేస్తారు. పంచదార వాడరు.

freepik

ఫ్రెంచ్ ఫ్రైలు, బర్గర్లు, ఫాస్ట్ ఫుడ్స్ లాంటివి అద్దుకుని తినడానికి ఎక్కువగా కెచప్ వాడతారు. 

freepik

పాస్తా, నూడుల్స్, మంచూరియా, సాల్సా లాంటివి వండటానికి సాస్ వాడతారు. 

freepik

రుచిలో సామీప్యత ఉన్నా, వాటి చిక్కదనంలో తేడా ఉంటుంది. సాస్ కాస్త పలుచగా ఉంటే, కెచప్ చిక్కగా ఉంటుంది. 

freepik

సాస్‌లో ఆరిగానోతో పాటూ మసాలాలు వాడటం వల్ల కెచప్ కన్నా కాస్త కారంగా ఉంటుంది. 

freepik

దాదాపు సాస్‌లన్నీ వేడిగా సర్వ్ చేయొచ్చు. అంటే వంటల్లో ఉడికించడానికి వాడొచ్చు. కెచప్ మాత్రం చల్లగానే సర్వ్ చేస్తారు.

freepik

కాలిఫ్లవర్‌ తింటే ఏమవుతుందో తెలుసా..! వీటిని తెలుసుకోండి

image credit to unsplash