దృష్టి లోపం చెక్ చేయడానికి వాడే చార్ట్ గురించి తెలుసా? 

freepik

By Koutik Pranaya Sree
Jul 09, 2024

Hindustan Times
Telugu

దృష్టి లోపాన్ని చెక్ చేయడానికి ఉపయోగించే చార్ట్‌ను స్నెల్లెన్ చార్ట్ అంటారు. 

pexels

1862 లో ఆప్థమాలజిస్ట్ హెర్మన్ స్నెల్లెన్ ఈ చార్ట్ కనుక్కున్నారు. అతని పేరు మీదుగానే ఈ చార్ట్‌కు పేరుపెట్టారు. 

pexels

ఈ చార్ట్‌లో 11 వరసల్లో అక్షరాలు, ఆకారాలుంటాయి. పైన పెద్దగా, కిందికి వస్తుంటే వాటి సైజు తగ్గుతూ ఉంటుంది. 

freepik

కంటి పరీక్ష చేసుకుంటున్న వ్యక్తి 6 మీటర్ల (20 ఫీట్లు) దూరంలో ఉండి ఈ చార్ట్ చదువుతారు. అందుకే ఎలాంటి దృష్టిలోపం లేకపోతే కంటిచూపు 6/6 లేదా 20/20 ఉందని చెబుతారు. 

freepik

చదువు రాని వాళ్లు, చదవలేని చిన్న పిల్లల దృష్టిలోపం చెక్ చేయడానికి E చార్ట్ వాడతారు. 

freepik

E  చార్ట్‌లో కేవలం ఒక్క E అక్షరం మాత్రమే ఉంటుంది. అక్షరం ఎటువైపు తిరిగి ఉందో గుర్తు పట్టాల్సి ఉంటుంది.

freepik

 దృష్టి లోపం చెక్ చేయడానికి LogMAR చార్ట్ కూడా వాడతారు. అక్షరాల అమరికలో స్నెల్లెన్ చార్ట్‌తో పోలిస్తే తేడా ఉంటుంది.

freepik

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels