ఆయుర్వేద చికిత్సలో ఉసిరికాయ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే దీని గింజలతో కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
Unsplash
By Anand Sai Oct 08, 2024
Hindustan Times Telugu
ఉసిరిని ఉపయోగించి దాని గింజలను పారేస్తాం. కానీ ఈ విత్తనం చాలా ముఖ్యమైన ఆరోగ్యకరమైన అంశాలను కలిగి ఉంటుంది.
Unsplash
ఉసిరి గింజల్లో పీచు ఎక్కువగా ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఇది పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
Unsplash
ఉసిరి గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ సి, ఇతర పాలీఫెనాల్స్, ఇవి శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తటస్తం చేయడంలో సహాయపడతాయి.
Unsplash
ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం ద్వారా, ఇవి గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
Unsplash
ఉసిరి గింజలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే సామర్థ్యం కారణంగా హృదయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
Unsplash
మధుమేహం ఉన్నవారు లేదా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్న వారు ఈ సీడ్ పౌడర్‌ను ఉపయోగించడం ఉత్తమం.
Unsplash
ఉసిరి గింజలను ఎండలో బాగా ఆరబెట్టి తర్వాత ఒక పాత్రలో తక్కువ మంట మీద కాల్చుకోవాలి. తర్వాత మిక్సీ జార్‌లో వేసి గ్రైండ్ చేసుకుంటే ఉసిరి గింజల పొడి తయారవుతుంది.
Unsplash
రక్తంలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, థ్రాంబోసైట్లు లేదా ప్లేట్ లెట్ లు ఉంటాయి. వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉండడం వల్ల ప్లేట్ లెట్ల సంఖ్య తగ్గుతుంది. ప్లేట్ లెట్ల సంఖ్యను పెంచే 7 ఆహారాల గురించి తెలుసుకుందాం.