మామిడి పండ్లను అందరూ ఇష్టపడతారు, అయితే మామిడి ఆకుల్లోనూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా? 

Unsplash

By Anand Sai
Sep 11, 2024

Hindustan Times
Telugu

మామిడి ఆకులను శతాబ్దాలుగా సాంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తున్నారు. మధుమేహాన్ని నియంత్రించడం నుండి ఉబ్బసం నియంత్రణ వరకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

Unsplash

మామిడి ఆకులతో చేసిన కషాయాన్ని అతిసారం, ఇతర కడుపు వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు. రక్తపోటు, ఉబ్బరం వంటి సమస్యలను సరిచేస్తుంది.

Unsplash

మామిడి ఆకుల్లో రక్తంలో చక్కెరను తగ్గించే గుణాలు ఉన్నాయి. మామిడి ఆకులలోని మాంగిఫెరిన్, ఫ్లేవనాయిడ్స్ వంటి కారకాలు శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను నియంత్రిస్తాయి.

Unsplash

రక్తపోటును తగ్గించడానికి మామిడి ఆకులను చాలా సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు. క్వెర్సెటిన్, ఐసోక్వెర్‌సిట్రిన్, ఆస్ట్రాగాలిన్ వంటి క్రియాశీల పదార్థాలు అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి.

Unsplash

మామిడి ఆకులలోని ఫినాలిక్ సమ్మేళనాలు సహజమైన, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. 

Unsplash

ఈ ఆకుల్లో ఉండే టానిన్, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు జీర్ణవ్యవస్థ సజావుగా పనిచేసేలా చేస్తాయి.

Unsplash

మామిడి ఆకులతో చేసిన టీ ఆస్తమా, బ్రాంకైటిస్, సాధారణ జలుబు వంటి శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం అందిస్తుంది.

Unsplash

లస్సీ తాగితే ఏమవుతుంది..! వీటిని తెలుసుకోండి

image credit to unsplash