కిడ్నీలు శరీరంలో కీలకమైన వడపోత వ్యవస్థగా పనిచేస్తాయి. రక్తం నుంచి వ్యర్థ పదార్థాలను, అదనపు ద్రవాన్ని తొలగిస్తాయి. రక్తాన్ని సరిగ్గా ఫిల్టర్ చేయడంలో కిడ్నీలు విఫలమైనప్పుడు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. 

unsplash

By Bandaru Satyaprasad
Jun 15, 2024

Hindustan Times
Telugu

కిడ్నీల ఆరోగ్యానికి మీ జీవనశైలి, ఆహార ఎంపిక అవసరం. మూత్రపిండాల సమస్యలు తగ్గించుకోవడానికి ఈ ఆహారాలకు దూరంగా ఉండండి.   

unsplash

అధిక సోడియం ఆహారాలు- కిడ్నీ సమస్యలకు సోడియం ఒక ముఖ్యమైన కారణం. కిడ్నీలు సోడియం బ్యాలెన్స్ చేస్తాయి. అధిక సోడియం వల్ల అధిక రక్తపోటు, కిడ్నీల వాపునకు దారి తీస్తుంది. క్యాన్డ్ సూప్‌లు,  ప్యాక్డ్ స్నాక్స్, చిప్స్, ప్రాసెస్డ్ నాన్ వెజ్, ఫాస్ట్ ఫుడ్స్ ఆహారాలు వద్దు.  

pexels

అధిక ఫాస్పరస్ ఆహారాలు - కిడ్నీలు నియంత్రించే మరొక మినరల్ ఫాస్పరస్. వీట్ స్థాయిలు పెరిగితే కిడ్నీ వ్యాధి ఉన్నవారికి ఎముక, గుండె సమస్యలకు దారితీస్తాయి. పాలు, జున్ను, పెరుగు, గింజలు, విత్తనాలు, తృణధాన్యాలు, కొన్ని సీఫుడ్స్ లో ఫాస్పరస్ అధికంగా ఉంటుంది. వీటిని పరిమితంగా తీసుకోండి.     

pexels

పొటాషియం అధికంగా ఉండే ఆహారాలు- కండరాల పనితీరు, గుండె ఆరోగ్యానికి పొటాషియం అవసరం. అయితే, అధిక పొటాషియం కిడ్నీల వ్యాధి ఉన్నవారికి హానికరం. కిడ్నీలు సరిగ్గా పనిచేయనప్పుడు పొటాషియం రక్తంలో పేరుకుపోతుంది. ఇది గుండె సమస్యలకు దారితీస్తుంది. అరటిపండ్లు, అవకాడోలు, నారింజ, టమోటాలు, బంగాళదుంపలు, చిలగడదుంపలలో పొటాషియం అధికంగా ఉంటుంది.  

pexels

 ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ - బరువు తగ్గడం , కండరాల బలం, ఎముకలకు  ప్రోటీన్ చాలా ముఖ్యమైనది. ప్రోటీన్ అధికంగా తీసుకోవడం వల్ల కిడ్నీల సమస్యలు వస్తాయి. కిడ్నీల వ్యాధి ఉన్నవారిలో అధిక ప్రొటీన్ ఆహారం రక్తపోటును కలిగిస్తుంది.  పౌల్ట్రీ, రెడ్ మీట్, చేప, గుడ్లు, పాల ఉత్పత్తుల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి.  

pexels

అధిక ఆక్సలేట్ ఆహారాలు - ఆక్సలేట్‌లు మూత్రపిండాల్లో రాళ్ల ఏర్పడడానికి కారణం. అధిక ఆక్సలేట్ ఆహారాలు- పాలకూర, దుంపలు, గింజలు, చాక్లెట్, మద్యం. కిడ్నీల్లో రాళ్ల ప్రమాదాన్ని తగ్గించడానికి క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటి తక్కువ ఆక్సలేట్ కూరగాయలను తినవచ్చు.

pexels

కిడ్నీల వ్యాధుల నివారణ చిట్కాలు- రోజు తగిన మొత్తంలో నీరు తాగాలి,  బీపీ క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాలి, డయాబెటిక్ రోగులు షుగర్ లెవల్స్ కంట్రోల్ చేసుకోవాలి.   

pexels

 ఆహార లేబుల్‌లపై సోడియం, పొటాషియం, ఫాస్పరస్ కంటెంట్ తనిఖీ చేసుకుని పదార్థాలు కొనుగోలు చేయాలి.  అదనపు ఉప్పు లేని ఇంటి భోజనాన్నే తినండి.  కిడ్నీల పనితీరును పర్యవేక్షించడానికి రెగ్యులర్ చెక్-అప్‌ చేసుకోండి. 

pexels

థైరాయిడ్ ఆరోగ్యంగా ఉండటం ప్రతి మనిషికి చాలా అవసరం. మరి ఆ థైారాయిడ్ ఆరోగ్యానికి ఏ డ్రింక్స్ తాగాలో చూడండి

Pixabay