క్రియేటినిన్ అనేది మన శరీరంలో ఉత్పత్తి అయ్యే వ్యర్థ పదార్థం. దీన్ని కిడ్నీలు తొలగిస్తాయి. క్రియాటినైన్ స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు, కిడ్నీలు దెబ్బతినడం లేదా కిడ్నీల వ్యాధికి దారితీయవచ్చు. క్రియాటినైన్ స్థాయిలను తగ్గించే ఆహారాల గురించి తెలుసుకుందాం.
twitter
By Bandaru Satyaprasad Sep 09, 2024
Hindustan Times Telugu
ఆరోగ్యకరమైన వ్యక్తులలో సీరం క్రియాటినైన్ లెవల్స్ 0.6 నుంచి 1.3 mg/dL వరకు ఉంటాయి. క్రియాటినైన్ స్థాయిలు మగవారికి 0.7 - 1.3 mg/dL మధ్య, ఆడవారికి 0.6 - 1.1 mg/dL మధ్య ఉండాలి.
twitter
కీరాదోసకాయలు క్రియాటిన్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ప్రతిరోజూ ఒకటి లేదా రెండు కీరదోస తినాలి.
pexels
ఉల్లిపాయలు యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి. ఇవి రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ బెలెన్స్ చేయడంలో సహాయపడుతాయి. కిడ్నీలపై భారాన్ని తగ్గిస్తాయి.
pexels
వెల్లుల్లి క్రియాటినైన్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. మీ భోజనంలో 1-2 వెల్లుల్లి రెబ్బలు జోడించండి. ఇవి శరీరంలో ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు తగ్గించడంలో, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
pexels
రెడ్ బెల్ పెప్పర్ క్రియాటినైన్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. రోజులో కనీసం ఒక రెడ్ బెల్ పెప్పర్‌ను తీసుకోవాలి. ఇది విటమిన్‌లతో నిండి ఉంటుంది. మూత్రపిండాలపై అధిక భారం వేయదు.
pexels
ప్రతిరోజూ ఒక యాపిల్ మీకు ఫైబర్‌ని ఇస్తుంది. మీ జీర్ణక్రియకు సహాయపడుతుంది. కిడ్నీలపై ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. క్రియాటినైన్ స్థాయిల తగ్గించుకునేందుకు రోజుకు ఒక యాపిల్ తినవచ్చు.
twitter
కాలీఫ్లవర్ లో ఖనిజాలు తక్కువగా ఉంటాయి. వ్యర్థాలను తొలగించేందుకు కిడ్నీకి సహాయపడుతుంది. అర కప్పు వండిన కాలీఫ్లవర్‌లో 1.8 గ్రా ఫైబర్ ఉంటుంది. ఇది క్రియాటినైన్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
pexels
క్రాన్బెర్రీ తీసుకోవడం ద్వారా యూరినరీ ట్రాక్ బాక్టీరియా ఇన్ ఫెక్షన్ ను తగ్గించుకోవచ్చు. ఇది మూత్రపిండాలపై భారం తగ్గిస్తుంది.
pexels
బ్లూబెర్రీస్ అధిక క్రియేటిన్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. బ్లూబెర్రీస్‌లో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. వీటిలోని సోడియం, ఫాస్పరస్ కిడ్నీలకు మంచి చేస్తాయి.
pexels
కొత్తిమీర దాదాపు అన్ని వంటలలో ఉపయోగిస్తున్నారు. ఇది ఆహార రుచిని పెంచడమే కాకుండా వివిధ సమస్యలను పొగొడుతుంది.