జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు ఆహారంలోని పోషకాలు చాలా ముఖ్యం. వెంట్రుకలు, కుదుళ్లు బాగుండడంలో ఇవి కీలకపాత్ర పోషిస్తాయి. జుట్టు పెరిగేందుకు, మెరుగ్గా ఉండేందుకు ముఖ్యమైన ఐదు విటమిన్లు ఏవో ఇక్కaడ తెలుసుకోండి.
Photo: Pexels
జుట్టు బాగా పెరిగేందుకు విటమిన్-ఏ చాలా ముఖ్యమైన పోషకం. క్యారెట్లు, గుమ్మడి, పాలకూర, కోడిగుడ్లు, చేపలు, చిలగడదుంపల్లో ఏ విటమిన్ పుష్కలంగా ఉంటుంది.
Photo: Pexels
జుట్టు కుదుళ్లు బలంగా ఉండేందుకు, రాలడం తగ్గేందుకు విటమిన్-ఈ కీలకపాత్ర పోషిస్తుంది. జుట్టు పెరిగేలా చేస్తుంది. ఆకుకూరలు, ధాన్యాలు, నట్స్, వెజిటబుల్ ఆయిల్స్‌లో విటమిన్-ఈ ఎక్కువగా ఉంటుంది.
Photo: Pexels
కొలాజెన్ ఉత్పత్తి పెంచి జుట్టు పెరుగుదలను విటమిన్-బీ మెరుగుపరుస్తుంది. పుట్టగొడుగులు, పప్పు ధాన్యాలు, క్యాలిఫ్లవర్, క్యాబేజీ, బ్రోకలీ, పాలు, చికెన్‍లో విటమిన్ బీ పుష్కలంగా ఉంటుంది.
Photo: Pexels
కుదుళ్ల ఆరోగ్యాన్ని, రక్తప్రసరణను మెరుగుపరిచి జుట్టు పెరుగుదలకు విటమిన్ కే మేలు చేస్తుంది. క్యాబేజ్, కోడిగుడ్లు, పాలకూర, కేల్‍లో విటమిన్ కే మెండుగా ఉంటుంది.
Photo: Pexels
విటమిన్ డీ కూడా జుట్టు పెరుగుదలకు ముఖ్యం. ఫోర్టిఫైడ్ మిల్స్, ఫ్యాటీ ఫిష్‍ల్లో ఈ పోషకం ఎక్కువగా ఉంటుంది.
Photo: Pexels
ఈ ఆహారాలు కొంచెం తింటే చాలు జుట్టు ఇట్టే రాలిపోతుంది.. జాగ్రత్త!