డయాబెటిస్ (షుగర్/మధుమేహం)తో బాధపడే వారు ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే, వాళ్లు చేప తినొచ్చా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది.
Photo: Pexels
డయాబెటిస్ ఉన్న వారు చేపలు తినొచ్చని, వీటి వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయని కొన్ని వైద్య అధ్యయనాలు స్పష్టం చేశాయి.
Photo: Pexels
మధుమేహం ఉన్న వారు వారంలో ఒకటి లేదా రెండుసార్లు చేపలు తినడం మంచిది. మరీ ఎక్కువగా కాకుండా మోతాదులోనే తీసుకోవాలి. దీనివల్ల గుండె సంబంధిత వ్యాధుల రిస్క్ తగ్గే అవకాశం ఉంటుంది. డయాబెటిస్ ఉన్న వారు చేపలు తింటే ప్రయోజనాలు ఏవంటే..
Photo: Pexels
చేపల్లో గ్లిసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. దీంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతం పెరగకుండా నియంత్రణలో ఉండేందుకు ఇవి సహకరిస్తాయి.
Photo: Pexels
చేపల్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇవి తింటే బరువు పెరగడాన్ని నియంత్రించేందుకు ఉపయోగపడుతుంది. ఇందులో కార్బొహైడ్రేట్స్ కూడా తక్కువగా ఉంటాయి.
Photo: Pexels
చేపల్లో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్ కంటెంట్ ఉంటుంది. దీనివల్ల గుండె జబ్బుల రిస్క్ తగ్గుతుంది. ఎముకల దృఢత్వం కూడా చేపలు తినడం వల్ల మెరుగవుతుంది.
Photo: Pexels
గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి