మీ ఆహారంలో ఈ 10 సూపర్‌ ఫుడ్స్ ను చేర్చితే శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. దీంతో దీర్ఘకాలిక ఆరోగ్యం మీ సొంతం.  

unsplash

By Bandaru Satyaprasad
Sep 07, 2023

Hindustan Times
Telugu

కాలె ఆకుకూర ఇది క్యాబేజి రకానికి చెందింది. ఈ ఆకుకూర విటమిన్స్, మినరల్స్ కలిగిఉంటుంది. ఇందులో విటమిన్లు A, C, K, అలాగే కాల్షియం, ఫైబర్‌ అధికంగా ఉంటాయి.  

unsplash

 బ్లూబెర్రీస్(నేరేడు రకం) - యాంటీఆక్సిడెంట్స్ కలిగి ఉంటుంది. బ్లూబెర్రీస్ విటమిన్ సి, ఫైబర్‌ అందజేస్తూ ఆక్సీకరణ ఒత్తిడిపై పోరాడుతుంది.  

unsplash

సాల్మన్ చేప- ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌తో సంవృద్ధిగా ఉండే సాల్మన్ చేపలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ప్రోటీన్, విటమిన్లు, మినరల్స్ ను అందిస్తుంది. 

unsplash

క్వినోవా - ప్రోటీన్ ప్యాక్డ్ ధాన్యం. క్వినోవా అనేది ఫైబర్, విటమిన్లు, మినరల్స్‌తో పాటు మొత్తం తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలను అందిస్తుంది.

unsplash

చియా సీడ్స్ - ఈ చిన్న విత్తనాలు ఫైబర్ అధికంగా కలిగి ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు, మినరల్స్ ను చియా సీడ్స్ శరీరానికి సరఫరా చేస్తాయి. 

unsplash

చిలగడ దుంపలు(స్వీట్ పొటాటో) లో విటమిన్ ఎ, సి, అలాగే ఫైబర్ ఉంటాయి. స్వీట్ పొటాటోలు కంటి ఆరోగ్యాన్ని, జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి. 

unsplash

బ్రకోలీలో విటమిన్ సి, కె, ఫైబర్ , శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. 

unsplash

అవకాడో - ఆరోగ్యకరమైన కొవ్వులకు కలిగి ఉంటాయి. అవకాడో గుండె, చర్మ ఆరోగ్యానికి ఫైబర్, విటమిన్లు, మినరల్స్ అందిస్తాయి.

unsplash

వాల్‌నట్స్ లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు మెదడు పనితీరు, గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి.

unsplash

పసుపు - ఈ మసాలా దినుసులో కర్కుమిన్ ఉంటుంది. ఇది  యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంటాయి.  

unsplash

ఇటీవలి కాలంలో రాగులు ఎక్కువగా తింటున్నారు. వీటితో రోగనిరోధక శక్తితోపాటుగా అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

Unsplash