చర్మం బాగుండాలంటే మీ ఆహారంలో తప్పకుండా ఉండాల్సిన పోషకాలు ఇవి
Photo: Pexels
By Chatakonda Krishna Prakash Jun 19, 2024
Hindustan Times Telugu
ఆరోగ్యకరమైన, మెరిసే చర్మం ఉండాలంటే పోషకాలు ఉండే ఆహారం తినడం చాలా ముఖ్యం. చర్మం మెరుగ్గా ఉండాలంటే ఆహారంలో ఉండాల్సిన పోషకాలు ఏవో ఇక్కడ చూడండి.
Photo: Pexels
యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఆహారాలు తింటే చర్మానికి మేలు జరుగుతుంది. బెర్రీలు, నట్స్, ఆకుకూరల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి.
Photo: Pexels
చర్మపు ఆరోగ్యానికి తోడ్పడే కొలేజన్ ఉత్పత్తిలో విటమిన్ సీ, విటమిన్ ఈ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. సిట్రస్ పండ్లు, కీరదోసకాయలు, అవడాలోలు, వేరుశనగ కాయలు లాంటి ఆహారాల్లో ఈ విటమిన్లు అధికంగా ఉంటాయి. ఈ రెండు విటమిన్లు ఉన్న ఆహారం తీసుకోవడం చర్మానికి మంచిది.
Photo: Pexels
జింక్.. చర్మంపై మంటను తగ్గించి, కణాల ఉత్పత్తిని నియంత్రిస్తుంది. కాయధాన్యాలు, నట్స్, విత్తనాలు, కోడిగుడ్లలో జింక్ ఎక్కువగా ఉంటుంది.
Photo: Pexels
చర్మం ఆరోగ్యం మెరుగ్గా ఉండటంలో ఫ్యాటీ యాసిడ్స్ కూడా కీలకపాత్ర పోషిస్తాయి. అవిసె గింజలు, ఫ్యాటీ ఫిష్, చియా సీడ్స్, ఆక్రోటు లాంటి వాటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.
Photo: Pexels
నీటిలో సోడియమ్, మెగ్నిషియమ్, పొటాషియమ్ లాంటి పోషకాలు ఉంటాయి. అందుకే చర్మం హెడ్రేటెడ్‍గా, మెరుగ్గా ఉండాలంటే తప్పనిసరిగా సరిపడా నీరు తాగాలి.
Photo: Pexels
గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి