పారాసిటమాల్ ఎక్కువగా వేసుకుంటే ఈ సమస్యలు తప్పవు

pixabay

By Haritha Chappa
Apr 27, 2024

Hindustan Times
Telugu

ఒళ్లు నొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా వెంటనే పారాసిటమాల్ ట్యాబ్లెట్లు మింగేస్తారు ఎంతోమంది. ఇష్టం వచ్చినట్టు ఈ మాత్రలను వాడితే సమస్యలు తప్పవు. 

pixabay

మెడికల్ షాపులో ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇచ్చే మందుల్లో పారసిటమాల్‌దే ప్రథమ స్థానం. 

pixabay

అయితే ఎక్కువ కాలం పాటూ ప్రతి రోజూ పారాసిటమాల్ వేసుకుంటే మాత్రం కొన్ని రకాల సమస్యలు వస్తాయి. 

pixabay

 అప్పుడప్పుడు వీటిని వాడితే ఫర్వాలేదు కానీ, తరచూ ఎక్కువగా వేస్తే మాత్రం ఆరోగ్యానికి హాని అని చెబుతున్నారు.

pixabay

పారాసిటమాల్ దీర్ఘకాలంపాటూ వాడినా, ఒకేరోజు మోతాదుకు మించి తీసుకున్నా కొన్ని రకాల అనారోగ్యాలు వస్తాయి.

pixabay

త్వరగా బరువు తగ్గడం, వాంతులు కావడం, పొట్ట నొప్పి రావడం వంటి సమస్యలు కనిపిస్తాయి.

pixabay

ఎక్కువ కాలం పాటూ రోజూ పారాసిటమాల్ వేస్తే కిడ్నీలు, పాంక్రియాటిస్, కాలేయం వంటి ప్రధాన అవయవాలు ఫెయిలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. 

pixabay

కాబట్టి పారాసిటమాల్ వినియోగాన్ని ఎంత తగ్గిస్తే అంత మంచిది. 

pixabay

ఎర్ర అరటిపండ్లు కనిపిస్తే కొనేయండి..! వాటితో ఎన్నో ఆరోగ్య లాభాలు

image credit to unsplash