వేసవిలో ఐస్ క్రీం తినడానికి అందరూ ఇష్టపడుతారు. ఎండ వేడికి తింటే హాయిగా అనిపిస్తుంది.

Unsplash

By Anand Sai
Apr 15, 2024

Hindustan Times
Telugu

కొన్ని అధ్యయనాల ప్రకారం ఐస్ క్రీం మీ శరీర ఉష్ణోగ్రతను చల్లబరచడానికి బదులుగా పెంచుతుంది.

Unsplash

ఐస్ క్రీం తినడం వల్ల శరీరం వేడిగా ఉంటుంది.. చల్లగా ఉండదు.

Unsplash

ఐస్‌క్రీమ్‌లో చక్కెరతో పాటు 10 శాతానికి పైగా పాల కొవ్వు ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి.

Unsplash

శరీరంలో కొవ్వు విచ్ఛిన్నమైనప్పుడు, అది గణనీయమైన వేడిని విడుదల చేస్తుంది. ఈ ప్రక్రియను ఫుడ్ ప్రేరిత థర్మోజెనిసిస్ అంటారు.

Unsplash

ఇతర పోషకాలతో పోలిస్తే, కొవ్వులు ఎక్కువ శక్తిని కలిగి ఉంటాయి.. శరీరంలో వేడిని విడుదల చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

Unsplash

ఐస్ క్రీం భాగాలు విచ్ఛిన్నం కావడం ప్రారంభించిన తర్వాత.. దాని శీతలీకరణ ప్రభావం తగ్గిపోతుంది. కడుపులో వేడి పెరుగుతుంది.

Unsplash

పాలలోని కొవ్వు, చక్కెర శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తాయి. బయట ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఈ అదనపు వేడి మనల్ని చల్లగా ఉంచదు.

Unsplash

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels