కొబ్బరి నూనెను సౌందర్య సాధనాల్లో ఉపయోగిస్తుంటారు. వివిధ చర్మ, జుట్టు సమస్యలను త్వరగా పరిష్కరించడానికి ఇది ఉపయోగపడుతుంది.

Unsplash

By Anand Sai
Jan 26, 2024

Hindustan Times
Telugu

చర్మం, జుట్టు మాత్రమే కాదు. పొడి పెదవులు, చంకల దుర్వాసన తొలగించడానికి కొబ్బరి నూనె చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Unsplash

ఇది యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది. దుర్వాసన కలిగించే బ్యాక్టీరియాను తగ్గించడంలో సహాయపడుతుంది.

Unsplash

పెదవులు గరుకుగా, పొడిగా మారితే కొబ్బరినూనె, తేనె కలిపి రాసుకోవచ్చు. ఈ సహజ పదార్థాలు రెండూ చర్మాన్ని తేమగా ఉంచుతాయి. 

Unsplash

ఒక టీస్పూన్ కొబ్బరి నూనెలో ఒక టీస్పూన్ తేనె మిక్స్ చేసి పెదాలకు అప్లై చేయాలి. ఐదు నిమిషాల తర్వాత, టిష్యూతో పెదాలను మెల్లగా తుడవండి.

Unsplash

బేకింగ్ సోడా, కొబ్బరి నూనెను కలిపి మీ చంకలపై అప్లై చేయండి. బేకింగ్ సోడా చెమటను గ్రహించి దుర్వాసనను తగ్గిస్తుంది. 

Unsplash

కొబ్బరి నూనె చర్మానికి పోషణను, తేమను అందిస్తుంది. ఒక చెంచా కొబ్బరి నూనెతో రెండు చెంచాల బేకింగ్ సోడా కలపాలి.

Unsplash

సువాసన కోసం మీరు ఈ మిశ్రమానికి కొన్ని చుక్కల ముఖ్యమైన నూనెను కూడా జోడించవచ్చు. ఈ మిశ్రమాన్ని చంకలపై కొన్ని నిమిషాల పాటు అప్లై చేయండి. తర్వాత నీటితో కడగాలి. చంకలు వాసన రావు.

Unsplash

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels