మనలో చాలా మందికి గోళ్లు కొరితే అలవాటు అంటుంది. ముఖ్యంగా పిల్లల్లో ఎక్కువగా ఈ అలవాటు చూస్తుంటాం. ఈ చెడు అలవాటును ఎంత తొందరగా మానేస్తే అంత మంచిందని వైద్యులు అంటున్నారు.  

pexels

By Bandaru Satyaprasad
Jul 28, 2024

Hindustan Times
Telugu

గోళ్లు కొరకడంతో కొన్ని ఆరోగ్య సమస్యలకు కూడా దారితీయవచ్చు. ఆందోళన, ఒత్తిడి, చిరాకు, మానసిక సమస్యలు, పర్ఫెక్షనిజం, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (OCD), నిరాశ కారణాలు గోళ్లు కొరకడానికి కారణాలని అధ్యయనాలు చెబుతున్నాయి.  

pexels

గోళ్లు కొరకడం వల్ల.. గోళ్లలో ఇన్ఫెక్షన్, వేళ్ల పైభాగంలో పుండ్లు పడడం, గోరు కొరకడం వల్ల దంత ఆరోగ్యం దెబ్బతింటుంది. గోళ్లలోని బ్యాక్టీరియా, క్రిములతో అనే అనారోగ్యాలు కారణం కావొచ్చు.   

pexels

మీ జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే గోళ్లు కొరికే అలవాటును విడిచిపెట్టవచ్చు.   

pexels

ఒత్తిడిని నివారించండి- ఒత్తిడి, ఆందోళన గోళ్లు కొరకడానికి కారణమవుతాయి. ఒత్తిడిని తగ్గించుకుంటే గోరు కొరికే అలవాట్లను వదిలించుకోవచ్చు. యోగా, మెడిటేషన్, రిలాక్సేషన్ టెక్నిక్‌లతో ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించి ఒత్తిడి తగ్గించుకోవచ్చు.   

freepik

స్ట్రెస్ బాల్ - మీకు గోళ్లను కొరుక్కోవాలని అనిపించినప్పుడు, ఆ దృష్టి మరల్చేందుకు స్ట్రెస్ బాల్ ఉపయోగించవచ్చు.   

pexels

చేదుగా ఉండే నెయిల్ పాలిష్ - చేదుగా ఉండే నెయిల్ పాలిష్ లేదా బ్యాండేజీలు ఉపయోగించడం వంటి గోళ్లు కొరికే అలవాటు మానుకోవచ్చు. వెనిగర్‌ను కూడా అప్లై చేయవచ్చు.   

గోళ్లను కత్తిరించుకోండి- గోళ్లను కత్తిరించడానికి వారంలో కొంత సమయాన్ని కేటాయించుకోండి. నెయిల్ పర్ఫెక్షనిజంతో ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు. 

pexels

గోళ్లను అందంగా మార్చుకోండి - మీ గోళ్లను కొరకకుండా ఉండటానికి మంచి మార్గం వాటిని అందంగా ఉంచడం. చేతులను అందంగా, గోళ్లను శుభ్రంగా ఉంచుకుంటే...వాటిని చెడగొట్టుకునేందుకు మీరు ప్రయత్నించరు.   

pexels

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels