కాలు బెణికితే.. వెంటనే ఇలా చేయండి- అప్పుడే రిలీఫ్​!

pixabay

By Sharath Chitturi
Mar 10, 2024

Hindustan Times
Telugu

కాలు బెణికి ఎక్కువ నొప్పి వస్తే.. ముందు ఎక్స్​-రే తీసుకోవడం మంచిది. ఎముక విరినట్టైతే.. డాక్టర్​ని సంప్రదించాలి. సాధారణ కాలు బెణుకు అయితే ఇంట్లోనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు.

pixabay

అన్నింటికన్నా ముఖ్యం 'రెస్ట్​'. కాలుకు ఎంత రెస్ట్​ ఇస్తే అంత మంచిది. కొన్ని రోజుల పాటు ఎక్కువ తిరగకపోవడం బెటర్​.

pixabay

కాలు బెణికిన చోట ఐస్​ని అప్లే చేయాలి. నొప్పి వస్తున్న చోట.. ఐస్​ ప్యాక్​ని కనీసం 15 నుంచి 20 నిమిషాల పాటు రుద్దండి. ఇలా ప్రతి 2,3 గంటలకు ఒకసారి చేయండి.

pixabay

కాలు బెణికిన చోట వాపు రాకుండా ఉండాలంటే.. ఎలాస్టిక్​ బ్యాండేజ్​తో గట్టిగా చుట్టి పెట్టండి.

pixabay

కాలును ఎంత వీలైతే అంత ఎత్తులో పెట్టాలి. ఫ్లాట్​గా పడుకుని.. గుండె కన్నా ఎక్కువ హైట్​లో కాలును పెట్టాలి. మరీ ముఖ్యంగా రాత్రిళ్లు ఇలా చేయాలి.

pixabay

కాలు బెణికితే.. ఆ నొప్పి 2 నుంచి 3 వారాల పాటు ఉంటుంది. ఆ తర్వాత నిదానంగా తగ్గుతుంది.

pixabay

కాలు బెణికితే.. కనీసం 8 వారాల పాటు విపరీతమైన వ్యాయామాలు, రన్నింగ్​ వంటివి చేయకపోవడం మంచిది!

pixabay

ప్రకృతి అద్భుతాల్లో కాలీ ఫ్లవర్ ఒకటి

pixabay