యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్(UTI) అనేది మూత్రాశయం, మూత్రనాళం, కిడ్నీలతో సహా మూత్ర వ్యవస్థలోని వివిధ భాగాలను ప్రభావితం చేసే బ్యాక్టీరియా వ్యాప్తి చెందడం. యూటీఐ ముఖ్యంగా మహిళల్లో సర్వసాధారణం.
twitter
By Bandaru Satyaprasad Sep 18, 2024
Hindustan Times Telugu
మూత్ర విసర్జన సమయంలో తరచుగా నొప్పి, యోని దురద, కడుపు నొప్పి, మూత్రం దుర్వాసన యూటీఐ లక్షణాలు. దీనిని సహజంగా నివారించుకునేందుకు 7 చిట్కాలు తెలుసుకుందాం.
twitter
టాయిలెట్ ఉపయోగించిన తర్వాత బ్యాక్టీరియా వ్యాప్తి చెందకుండా ఆసన(యానల్) ప్రాంతాన్ని పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. పీరియడ్స్ సమయంలో బ్యాక్టీరియా పెరగకుండా తరచూ ప్యాడ్ లను మార్చుకోవాలి.
pexels
తగినంత నీరు తాగాలి- మీ శరీరాన్ని హైడ్రేటెట్ గా ఉంచడంతో మూత్ర వ్యవస్థ నుంచి బ్యాక్టీరియాను బయటకు పంపవచ్చు. మీ మూత్ర నాళాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు రోజుకు కనీసం 8 గ్లాసుల నీటిని తాగడం లక్ష్యంగా పెట్టుకోండి.
pexels
ప్రోబయోటిక్స్ - ప్రోబయోటిక్స్ లోని ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా యోని, గట్ మైక్రోబయోమ్ ను నిర్వహించడంలో సహాయపడుతుంది. ఇది యూటీఐ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పెరుగు, కేఫీర్ వంటి ఆహారాల ద్వారా ప్రోబయోటిక్స్ పొందవచ్చు.
pexels
క్రాన్బెర్రీ జ్యూస్ - క్రాన్బెర్రీ జ్యూస్ యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ను నివారిస్తుంది. యూటీఐకి కారణమయ్యే ఈ-కొలి బ్యాక్టీరియాను నిరోధించడంలో సహాయపడుతుంది.
pexels
తరచుగా మూత్ర విసర్జన - తరచుగా మూత్ర విసర్జన చేయండి. మూత్రాన్ని ఆపుకునే ప్రయత్నం చేయకండి. ఎప్పటికప్పుడు మూత్రాశయాన్ని ఖాళీ చేయండి. ముఖ్యంగా శృంగారానికి ముందు తర్వాత మూత్ర విసర్జన చేయండి. ఇది బ్యాక్టీరియాను బయటకు పంపి, యోని ఆరోగ్యాన్ని రక్షిస్తుంది.
pexels
కాటన్ ఇన్నర్ వేర్ - కాటన్ లోదుస్తులు తేమను గ్రహిస్తాయి. ఇవి బ్యాక్టీరియా వృద్ధిని తగ్గిస్తాయి. బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించడం మానుకోండి. అవి తేమ, వేడిని పెంచుతాయి.
pexels
సువాసన గల ఉత్పత్తులు - సబ్బులు, కొన్ని ఉత్పత్తులు, డౌచెస్ లోని సువాసనలు మూత్రనాళాన్ని చికాకుపెడతాయి. ఇవి బ్యాక్టీరియాను పెంచడానికి కారణమై యూటీఐ వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉంది.