16/8 ఇంటర్మిటెంట్​ ఫాస్టింగ్​ ఎలా చేయాలి? లాభాలేంటి?

Pixabay

By Sharath Chitturi
Feb 02, 2024

Hindustan Times
Telugu

ఇంటర్మిటెంట్​ ఫాస్టింగ్​కి ఈ మధ్య ఆదరణ పెరుగుతోంది. మరీ ముఖ్యంగా.. ఈ ఫాస్టింగ్​లో 16/8 రూల్​ని చాలా మంది ఫాలో అవుతున్నారు. మంచి ఫలితాలు కనిపిస్తున్నాయని అంటున్నారు.

Pixabay

16/8 ఇంటర్మిటెంట్​ ఫాస్టింగ్​ అంటే.. రోజులో 8 గంటలు తినడం.. 16 గంటలు అసలు ఏం తినకపోవడం.

Pixabay

ఈ రకం ఫాస్టింగ్​లో మనం తక్కువ తింటాము కాబట్టి.. శరీరంలోకి కేలరీలు తక్కువ వెళతాయి. ఫలితంగా.. వేగంగా బరువు తగ్గుతాము.

Pixabay

ఇంటర్మిటెంట్​ ఫాస్టింగ్​తో శరీరం నిత్యం యాక్టివ్​గా కూడా ఉంటుంది. ఏదైనా జరిగినా.. శరీరం వేగంగా రికవర్​ అవుతుంది.

Pixabay

16/8 రూల్​లో భాగంగా రాత్రి భోజనం ఎంత తొందరగా చేస్తే అంత మంచిది. ఉదయం బ్రేక్​ ఫాస్ట్​ స్కిప్​ చేసి నేరుగా లంచ్​ చేయవచ్చు.

Pixabay

ఉదాహరణకు.. రాత్రి 8 గంటలకు డిన్నర్​ చేస్తే.. అక్కడి నుంచి 16 గంటలు.. అంటే.. మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు ఏం తినకూడదు!

Pixabay

కొందరు.. తమ ఈటింగ్​ విండోని ఉదయం 9- 5 వరకు పెట్టుకుంటారు. ఇంకొందరు ఉదయం 10-6 వరకు కూడా పెట్టుకుంటారు. మీకు ఏది సెట్​ అవుతోందో చూసి, అప్లై చేసుకోండి. మంచి ఫలితాలు కనిపిస్తాయి.

Pixabay

శరీరంలో యూరిక్ యాసిడ్‍ను సహజంగా తగ్గించగల ఆహారాలు ఇవి

Photo: Unsplash