శరీరంలో అవిశ్రాంతంగా పనిచేసే అవయవాల్లో మూత్రపిండాలు కీలకమైనవి, నిరతరం రక్తాన్ని వడకట్టి వ్యర్థాలను, మలినాలను బయటకు పంపి శరీరంలో ద్రవాల సమతుల్యత కాపాడుతుంటాయి.
By Bolleddu Sarath Chandra Nov 04, 2024
Hindustan Times Telugu
మూత్ర పిండాలు, మూత్ర వ్యవస్థకు సంబంధించిన సమస్యల్లో మూత్ర వ్యవస్థలో రాళ్లు ఎక్కువ మందిలో కనిపిస్తుంది. ఆయుర్వేదంలో అశ్మరి,మూత్రాశ్మరి, వృక్కాశ్మరిగా దీనిని పరిగణిస్తారు
మూత్ర పిండాలు, మూత్ర నాళాలు, మూత్ర మార్గంలో ఎక్కడైనా రాళ్లు రావొచ్చు. లవణాలతో మూత్రం గాఢంగా తయారైతే అవి స్ఫటికాలుగా మారతాయి. వాటిపై కాల్షియం ఆక్సలేట్ చేరి రాళ్లుగా మారతాయి
తీసుకునే ఆహారం, దానిలో ఉండే పోషకాలు, లవణాలు ఆధారంగా ఇవి ఏర్పడతాయి. మూత్ర వ్యవస్థలో రాళ్లు ఉన్న ప్రదేశం, రాయి ఆకారం, పరిణామం ఆధారంగా దాని లక్షణాలు ఉంటాయి.
మూత్ర పిండంలో ఏర్పడే రాళ్లు ఎటువైపు ఉంటే ఆ వైపు పక్కటెముకల నొప్పి, నోటిలో నీరు ఊరడం, వాంతులు, కడుపు ఉబ్బరం, మూత్రంలో రక్తం వంటి సమస్యలు తలెత్తవచ్చు. కొందరిలో చాలా కాలం పాటు ఎలాంటి లక్షణాలు ఉండకపోవచ్చు.
మూత్రాశమంలో రాళ్లు ఉంటే మూత్రాన్ని ఆపుకోలేకపోవడం, ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం, మూత్రంలో చీము, రక్తం పడటం, పురుషాంగంలో నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి.
మూత్ర పిండాల సమస్యతో బాధపడే వారు రోజూ ఉదయం కప్పు ముల్లంగి రసంలో తేనె కలిపి తీసుకుంటే ఉపయోగం ఉంటుంది.
రెండు గ్లాసుల నీళ్ళలో రెండు స్పూన్ల ఉలవలు 2-3గంటలు నానబెట్టి, ఆ తర్వాత అరగ్లాసుకు వచ్చే వరకు మరిగించి చల్లారిన తర్వాత తాగాలి. రోజుకు రెండుసార్లు ఇది తాగాలి.
కప్పు నీటిలో 10-12 తులసి ఆకుల్ని పావుగంట మరిగించి దానిని వడగట్టి తేనెలో కలిపి రోజుకు రెండు సార్లు తీసుకోవాలి. మొక్కజొన్న కంకుల పీచును పది గ్రాముల వరకు గ్లాసు నీటిలో మరిగించి తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి.
చలికాలంలో ధనియాల నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే!