గుడ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎందుకంటే ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి అయితే వేసవిలో ఎన్ని గుడ్లు తినవచ్చు..

Unsplash

By Anand Sai
May 07, 2024

Hindustan Times
Telugu

వేసవిలో గుడ్లు తింటే ఎలాంటి హాని ఉండదు. అయితే మీరు ఎన్ని గుడ్లు తింటున్నారో ఒక్కటే గుర్తుంచుకోవాలి. గుడ్లలో అన్ని రకాల పోషకాలు ఉంటాయి.

Unsplash

గుడ్లలో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వేసవిలో మీ ఆరోగ్యానికి అనుగుణంగా రోజుకు ఒకటి లేదా రెండు గుడ్లు మాత్రమే తినండి.

Unsplash

మీరు దీన్ని ఉడకబెట్టవచ్చు లేదా ఆమ్లెట్ కూడా తయారు చేసుకోవచ్చు.

Unsplash

గుడ్డులో ఎర్ర రక్త కణాలను తయారు చేసే ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడమే కాకుండా ప్రమాదకరమైన వ్యాధుల నుండి కూడా రక్షిస్తుంది.

Unsplash

అలాగే గుడ్లలో అధిక మొత్తంలో కాల్షియం ఉంటుంది. ఇది ఎముకలను బలపరుస్తుంది. గుడ్లలో లుటిన్, జియాక్సంతిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి.

Unsplash

గుడ్లలో ఉండే పదార్థాలు కంటి రెటీనా నుండి మురికిని తొలగించి, కంటిశుక్లం ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

Unsplash

అదేవిధంగా గుడ్లు తినడం వల్ల శరీరంలోని అనేక సమస్యలు నయమవుతాయి. అలాగే కోడిగుడ్లలో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి.. కాబట్టి వీటిని కచ్చితంగా ఆహారంలో చేర్చుకోవాలి.

Unsplash

నేరుగా నిప్పులో కాల్చిన ఆహారాన్ని తింటే క్యాన్సర్ రావడం ఖాయమా? చాలా మంది కొన్ని రకాల ఆహారాలను నేరుగా నిప్పులు మీద కాల్చి తింటారు.

Unsplash