అరటి పండులో పొటాషియమ్, మెగ్నిషియమ్, విటమిన్ సీ, ఫైబర్ సహా చాలా పోషకాలు ఉంటాయి. ఇవి ప్రతీ రోజూ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు దక్కుతాయి. అయితే, రోజులో ఎన్ని అరటి పండ్లు తింటే మంచిది అనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది.
Photo: Pexels
రోజులో రెండు అరటి పండ్లు తింటే మేలు. పోషకాలు ఎన్ని ఉన్నా ఏదైనా మోతాదు మేరకు తింటేనే మంచిది.
Photo: Pexels
దీర్ఘకాల కిడ్నీ వ్యాధులు ఉన్న వారు పొటాషియమ్ తక్కువగా తీసుకోవాలి. అందుకే ఈ సమస్య ఉన్న వారు అరటి పండును తక్కువగా తినాలి.
Photo: Pexels
అరటి పండ్లను అతిగా తింటే పొటాషియమ్ ఎక్కువయ్యే హైపర్‌కలేమియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది కూడా తక్కువ శాతం మందికే ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే సాధాణంగా ఉన్న వారు రోజులో రెండు అరటి పండ్లు తింటే మేలు.
Photo: Pexels
అరటి పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీని వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. అలాగే, కడుపు నిండిన ఫీలింగ్ ఇస్తుంది. బరువు తగ్గేందుకు కూడా అరటి తోడ్పడుతుంది.
Photo: Pexels
అరటి పండ్లలో యాంటీఆక్సిడెంట్లతో పాటు చాలా పోషకాలు ఉంటాయి. ఇవి తింటే శరీరానికి శక్తి వెంటనే వస్తుంది. రోగనిరోధక శక్తి మెరుగువుతుంది. బ్లడ్ ప్రెజర్ కంట్రోల్‍లో ఉండేందుకు కూడా ఉపయోగపడుతుంది.
Photo: Pexels
రక్త హీనతతో బాధ పడుతున్నారా?.. ఇవి మీ ఆహారంలో చేర్చండి..