జొన్నలు ఎందుకు తినాలి..? ఈ విషయాలను తెలుసుకోండి

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Aug 25, 2024

Hindustan Times
Telugu

జొన్నల్లో మన శరీరానికి కావాల్సిన పోషకాలు, సూక్ష్మ పోషకాలు దండిగా ఉంటాయి.  సోడియం, జింక్‌, మెగ్నీషియం, పాస్ఫరస్‌ లాంటి సూక్ష్మ పోషకాలూ లభిస్తాయి.

image credit to unsplash

జొన్నల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్‌ని నియంత్రిస్తాయి. దీంతో దీర్ఘకాలిక రోగాల బారిన పడకుండా ఉంటాం.

image credit to unsplash

బరువు తగ్గాలనుకున్న వారు జొన్నల్ని ఎంచుకోవడం మంచి ఆలోచన. వీటిలో ఉండే పీచు పదార్థం, ప్రొటీన్ల వల్ల ఇవి కొంచెమే తిన్నా కడుపు నిండిన ఫీలింగ్ ని కలిగిస్తాయి. 

image credit to unsplash

శరీరంలోని కొలెస్ట్రాల్‌ స్థాయిల్ని తగ్గించడంలో జొన్నలు ముఖ్య పాత్ర వహిస్తాయి. ఫలితంగా గుండె సమస్యలు కూడా రావు.

image credit to unsplash

గోధుమలతో పోలిస్తే జొన్నలు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్‌ని కలిగి ఉంటాయి. కాబట్టి, రక్తంలో చక్కెర స్థాయిలని నెమ్మదిగా పెంచుతాయి. ఇవి షుగర్‌ని కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తాయి.

image credit to unsplash

జొన్నల్లో ఐరన్, పొటాషియం ఉంటుంది. ఇది గుండె పనితీరుకి మంచిది. అదే విధంగా ఎముకల్ని బలంగా చేస్తుంది

image credit to unsplash

జొన్నల్ని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందచ్చు.

image credit to unsplash

బరువు పెరగాలనుకుంటున్నారా? ఈ టిప్స్ పాటించండి

Photo: Pexels