మీ జుట్టు పెరగలా..! కాకరకాయ జ్యూస్ ట్రై చేయండి

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Sep 27, 2024

Hindustan Times
Telugu

కాకరకాయ తినడం వల్ల మన శరీరంలో ఉన్న అన్ని అవయవాలకు మేలే జరుగుతుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. 

image credit to unsplash

కాకరకాయ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టును పొడవుగా పెరిగేలా మెరిసేలా చేస్తుంది.

image credit to unsplash

కాకరకాయ జ్యూస్ లో చిటికెడ్ ఉప్పు వేసి తాగితే మంచి ఫలితాలు ఉంటాయి. జుట్టు పెరుగుదలపై సానుకూలమైన ప్రభావం చూపుతుంది.

image credit to unsplash

ఆలివ్ నూనెలో కాకరకాయ ముక్కలను వేసి  కొన్ని రోజులు పాటు ఉంచాలి. ఆ తర్వాత ముక్కలను తీసి జుట్టుకు వాడాలి. ఇది ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

image credit to unsplash

కాకరకాయ రసాన్ని తీసి మాడుకు నేరుగా అప్లై చేసుకోవచ్చు.  ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మీ జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది.

image credit to unsplash

కాకరకాయలో యాంటీ మైక్రోబయల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఎక్కువ ఉంటాయి. ఇది తలపై ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. దీనివల్ల జుట్టు రాలకుండా ఆగుతుంది. 

image credit to unsplash

కాకరకాయ జ్యూస్ వాడితే చుండ్రుతో పాటు తెల్ల జుట్టు సమస్యలు తగ్గుముఖం పడుతాయి.

image credit to unsplash

శరీరంలో యూరిక్ యాసిడ్‍ను సహజంగా తగ్గించగల ఆహారాలు ఇవి

Photo: Unsplash